Disha Patani| దిశా ప‌టాని టాటూ గోల‌… PD టాటూ గురించి ఎట్ట‌కేల‌కి స్పందించిన బోల్డ్ బ్యూటీ

Disha Patani| ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతున్న చిత్రం క‌ల్కి 2898 ఏడి. ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ చిత్రంలో దిశా పటాని ప్ర‌త్యేక పాత్ర‌

  • Publish Date - July 3, 2024 / 08:30 AM IST

Disha Patani| ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతున్న చిత్రం క‌ల్కి 2898 ఏడి. ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ చిత్రంలో దిశా పటాని ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. ఇందులో దిశా త‌న న‌ట‌న‌తోనే కాకుండా అందంతో కూడా అద‌ర‌గొట్టింది. చిత్రంలో ప్ర‌భాస్‌తో ఒకే ఒక్క పాట ఉండ‌గా, అది కూడా ఆమెతోనే ఉండడం ఆ పాట కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో దిశా పటాని హాట్ టాపిక్‌గా మారింది. మెయిన్ గా ఈ సాంగ్ లో దిశా గ్లామర్ షో అయితే బిగ్ హైలైట్ గా మారింది అని చెప్పాలి. అయితే దిశా ప‌టాని చేతిపై పీడీ అనే టాటూ ఒక‌టి క‌నిపించ‌గా, ఇప్పుడు అంద‌రిలో దీని గురించే చ‌ర్చ నడుస్తుంది.

దిశా ప‌టాని చేతిపై “PD” అనే టాటూ చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రభాస్​, దిశా రిలేషన్​లో ఉన్నారేమో అంటూ ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. “PD” అనే లెటర్స్ ప్రభాస్ డార్లింగ్ అంటూ డీకోడింగ్ చేస్తున్నారు.మ‌రి కొంద‌రు ప్ర‌భాస్ , దిశా ప‌టాని అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇది దిశా పటాని పేరులోని అక్షరాల రివర్స్ కూడా కావచ్చని కొందరి మాట. ఒక్క‌సారిగా ఈ టాటూ గురించి నెట్టింట తీవ్ర‌మైన చ‌ర్చ మొద‌లు కావ‌డంతో ఎట్ట‌కేల‌కి దిశా ప‌టాని స్పందించింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పిక్ షేర్ చేసి ఓ కామెంట్ పెట్టింది. నేను వేసుకున్న టాటూ గురించి ఇంత మంది క్యూరియాసిటీ చూపించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని పేర్కొంది. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఆనందం అంటూ ముందు కనుక్కోమంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి దిశా ప‌టాని త‌న టాటూతో కూడా ఒక్క‌సారిగా వార్త‌లలో నిలిచింది. ఈ అమ్మ‌డు తెలుగులో లోఫర్ అనే సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో ఈ భామ‌కి ప్ర‌త్యేకంగా పేరు రాలేదు. ఆ త‌ర్వాత హిందీలోకి వెళ్లి ప‌లు సినిమాలు చేసి అల‌రించింది. నాజూకు భామగా కుర్రకారు ఈ బ్యూటీని అదేపనిగా ఆరాధిస్తూ ఉన్నారు ఆమె అభిమానులు. తెరపై అందాలు ప్రదర్శించడంలో ఆమెకి పెద్దగా మొహమాటాలు లేవు. అందువలన ఆమెకి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాకి .. సినిమాకి మధ్యలో ఆమె సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.

Latest News