Game Changer|ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీని భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే ఇండియాతో పాటు యుఎస్ లో కూడా గేమ్ ఛేంజర్ చిత్ర ఈవెంట్స్ నిర్వహించేలా నిర్మాత దిల్ రాజు ప్రణాళిక రాణిస్తున్నారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించి పోస్టర్స్, సాంగ్స్ మాత్రమే విడుదల కాగా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేయటం విశేషం. అంతేకాదు దక్షిణాదిలో మరో 11 చోట్ల ఈ టీజర్ రిలీజ్ ను చేసేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్-సుదర్శన్, వైజాగ్- సంగం శరత్, రాజమండ్రి-శివ జ్యోతి, విజయవాడ-శైలజ, కర్నూల్- వి మెగా, నెల్లూర్-ఎస్2 థియేటర్, బెంగళూర్- ఊర్వశి థియేటర్, అనంతపూర్-త్రివేణి, తిరుపతి-పి.జి.ఆర్, ఖమ్మం-ఎస్‌వీసీ శ్రీతిరుమల థియేటర్లలో టీజర్‌ను అభిమానుల సమక్షంలో టీజర్ విడుదల చేస్తుండడం ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచనుందని అంటున్నారు. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ తో పాటు.. అన్ ప్రిడిక్టబుల్ అనే పదం తెగ వైరల్ అవుతోంది.
గేమ్ ఛేంజర్ చిత్రానికి అన్ ప్రిడిక్టబుల్ పదానికి సంబంధం ఏంటి అని ఆరాలు తీసే పనిలో పడ్డారు అభిమానులు. అందుతున్న సమాచారం మేరకు టీజర్ లో ‘అన్ ప్రిడిక్టబుల్’ అనే డైలాగ్ హైలైట్ కాబోతోందట. ఇక టీజర్ నిడివి 1 నిమిషం 40 సెకండ్ల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శంకర్ తన స్ట్రాంగ్ జోన్ అయిన పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రూపొందించారు. చివరిగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు2 చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ మూవీ ఎలా ఉంటుందో అనే టెన్షన్ అందరిలో మొదలైంది.