Bigg Boss8|బిగ్ బాస్ సీజన్ 8( Season8)లో ప్రస్తుతం ఆసక్తికర టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్‌లో రెండు టీమ్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్(Bigg Boss) రాయల్ అండ్ ఓజీ క్లాన్స్‌కు ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న కుషన్స్ ఉంచారు. ప్లాస్మాలో చూపించిన సింబల్ ఉన్న కుషన్స్‌ను తీసుకెళ్లి పక్కన గీసిన బాక్స్‌లో పెట్టాలి. రెండు క్లాన్స్ నుంచి ఒక్కొక్కరు, లేదా ఇద్దరు, ముగ్గురు ఇలా రావాలని, అది తానే చెబుతానని బిగ్ బాస్ చెప్పాడు. కుషన్స్ తీసుకెళ్లే సమయంలో ఇతర క్లాన్స్‌ను అడ్డుకోవచ్చని, అయితే, ఒక్కసారి బాక్స్‌లో పెట్టాక మాత్రం వాళ్లను టచ్ చేయొద్దని, కుషన్స్ ఉన్న వాళ్లే బాక్స్‌లోకి వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఇలా పలు రౌండ్స్‌లో సాగిన ఆటలో రాయల్ క్లాన్ గెలవడంతో మెగా చీఫ్ కంటెండర్‌షిప్ రేస్ నుంచి ఓజీలోని ఇద్దరు సభ్యులను తొలగించాలని బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశాడు. దాంతో రాయల్ క్లాన్ ఆలోచించుకునేందుకు లోపలికి వెళ్లారు. నిఖిల్(Nikhil), నబీల్ ఇదివరకు చీఫ్స్ అయ్యారు కాబట్టి వేరేవాళ్లకు ఛాన్స్ ఇద్దామని మెహబూబ్, హరితేజ అన్నారు. కాసేపు డిస్కషన్ తర్వాత గంగవ్వను లోపలికి పిలిచారు.ఇక బిగ్ బాస్ హౌస్ కు మెగా చీఫ్ గా గౌతమ్ విజయం సాధించాడు. ఈక్రమంలో అతను తన క్లాన్ సభ్యులు.. తన క్లోజ్ ప్రెండ్స్అయినా..మెహబూబ్ తో పాటు అవినాశ్(Avinash) కు కూడా వెన్నుపోటుపొడిచాడు.
విన్నర్ ప్రైజ్ మనీ పెంచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగా అవినాశ్ తో పాటు పృధ్వీ(Prithvi) త్యాగం చేయాలన్నారు. పృధ్వీకి గెడ్డం తో పాటు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. అది తియ్యనే తియ్యడు.అటువంటిది. పృధ్వీ గెడ్డం తీస్తే 25 వేలు.. గెడ్డంతో పాటు జుట్టు కాస్త కత్తిరించుకుంటే 50 వేలు.. క్లీన్ షేవ్ తో పాటు హెయిర్ స్టైల్ మార్చుకుంటే లక్ష రూపాయలు ప్రైజ్ మని ఇస్తామన్నారు బిగ్ బాస్. అవినాష్‌కి కూడా దాదాపు అదే టైప్ ఆఫర్ ఇచ్చాడు. అయితే అవినాష్ అందుకు ఓకే అన్నా కూడా పృథ్వీ ఒప్పుకోలేదు. అవినాష్(Avinash) త్యాగం వల్ల 50 వేల ప్రైజ్ మనీ పెరగడంతో పాటు… కుక్కింగ్ కోసం రెండు గంటలు యాడ్ అయ్యాయి. వాళ్లలో ఇద్దరిని తీసేయాలి ఎవరిని తీసేద్దామని గంగవ్వను అవినాష్ అడిగాడు. దాంతో ఆ నిఖిల్ గాన్ని తీసేయ్యాలే.. పెద్ద డేంజర్ గాడు వాడు.. అని గంగవ్వ అంది. దాంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. తర్వాత ఇంకొకరి పేరు చెప్పమంటే తన టీమ్ మెంబర్ అయిన రోహిణి పేరు చెప్పడంతో మళ్ళీ నవ్వుకున్నారు. వేరే టీం మెంబర్ పేరు చెప్పమంటే నబీర్ పేరు చెప్పింది. దీంతో రాయల్ క్లాన్ వెళ్లి ఓజీ నుంచి నిఖిల్, నబీల్‌ను తీసేస్తున్నట్లు, ఇదివరకు చీఫ్స్ అయ్యారని, వేరేవాళ్లకు అవకాశం ఇద్దామనే తొలగిస్తున్నట్లు చెప్పింది.