HariHara VeeraMallu| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం హరిహర వీరమల్లు. 17వ శతాబ్దంలో హిస్టారికల్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. మొఘల్ చక్రవర్తి, గోల్కొండ నవాబ్‌ల దోపిడిపై తిరుగుబాటు చేసిన బందిపోటు వీరమల్లు కథతో ఏఎం రత్నం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డియోల్ ఢిల్లీ మోఘల్ చక్రవర్తి పాత్రలో కనిపించబోతున్నారు. రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.
తొలి పార్ట్ “హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం” అనేది ఉపశీర్షిక. తాజాగా విడుదలైన టీజర్‌లో పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ కనిపించి అలరించారు. అద్భుతమైన దృశ్యాలు, ఆసక్తికరమైన సంభాషణలు మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్ ని చూస్తే అర్ధమవుతుంది. ఇక ఇందులో పవన్ కల్యాణ్ పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా కనిపిస్తుంటే, మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు
చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది.అయితే టీజర్‌లో దర్శకుడు ఎవరనేది మెన్షన్ చేయలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటాడని, మిగిలిన షూటింగ్ పార్ట్ కి అతనే డైరెక్ట్ చేస్తాడని, క్రిష్ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి, క్రిష్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో క్రిష్‌ని తప్పించి వేరే దర్శకుడిని సెలక్ట్ చేసి ఉంటారని సమాచారం.