Hema| ఇంత అంద‌మైన కూతురిని పెట్టుకొని అలాంటి పాడు ప‌నులు ఎలా చేయాల‌నిపించింది హేమ‌..!

Hema| బెంగుళూరు రేవ్ పార్టీ త‌ర్వాత టాలీవుడ్ స‌హాయ న‌టి హేమ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. రేవ్ పార్టీకి తాను హాజ‌రైన‌ప్ప‌టికీ, బెంగుళూరు సిటీ కమిషనర్ హేమ పార్టీలో ఉంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఈమె జ‌నాల‌ని డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ రేవ్ పార్టీలో హేమ

  • Publish Date - May 22, 2024 / 06:15 PM IST

Hema| బెంగుళూరు రేవ్ పార్టీ త‌ర్వాత టాలీవుడ్ స‌హాయ న‌టి హేమ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. రేవ్ పార్టీకి తాను హాజ‌రైన‌ప్ప‌టికీ, బెంగుళూరు సిటీ కమిషనర్ హేమ పార్టీలో ఉంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఈమె జ‌నాల‌ని డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ రేవ్ పార్టీలో హేమ ఉంద‌ని, ఆమెకి సంబంధించిన ఫొటో కూడా విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికీ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పింది. తను హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో చిల్ అవుతున్నానని ఒక వీడియో రిలీజ్ చేసి బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఆ త‌ర్వాత తను ఇంట్లోనే ఉండి హ్యాపీగా బిర్యానీ తయారు చేస్తున్నట్టుగా ఒక వీడియోను త‌న‌ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

హేమ తంతు చూస్తే.. బెంగళూరులో జరుగుతున్న దానితో తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆమె చేసిన వీడియో తప్పుదారి పట్టించే విధంగా ఉంద‌ని, ఆ వీడియో ఎలా చేశారు అన్నదానిపై విచారణ చేస్తున్నామని దయానంద్ చెప్పారు. అయితే రేవ్ పార్టీలో జ‌రిగిన‌ తనిఖీల్లో ఎండీఎంఏ పిల్స్, కొకైన్, హైడ్రో గాంజా సహా మరికొన్ని మత్తు పదార్థాలు పోలీసులు గుర్తించారు. మ‌రి హేమ తీసుకుందా లేదా అనే దానిపై అయితే క్లారిటీ రావ‌ల‌సి ఉంది. అయితే హేమ రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన త‌ర్వాత ఆమెకి సంబంధించి జ‌నాలు తెగ శోధించ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆమెకి ఇంత అంద‌మైన కూతురు కూడా ఉంద‌ని తెలిసి షాక్ అవుతున్నారు.

రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. ఈమె తెలుగులో 475 సినిమాల వరకు న‌టించింది. హేమ భర్త సయ్యద్ జాన్ అహ్మద్ కాగా, ఆయ‌న ఎంతో అమాయకుడని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. పెద్దలను ఎదిరించి.. సయ్యద్ జాన్ అహ్మద్ అనే సినిమాటోగ్రాఫర్‌ను మతాంతర ప్రేమ వివాహం చేసుకోగా,. ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె ఉంది. ఇషాకు ప్రస్తుతం 23సంవత్సరాలు. హీరోయిన్ ఫీచ‌ర్స్ ఉన్న ఇషా ఇండ‌స్ట్రీకి వ‌చ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. హేమ కూడా త‌న కుమార్తెని సినీ ఇండ‌స్ట్రీకి దూరంగానే ఉంచింది. అయితే త‌న కూతురిని పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్‌కి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారాలు సాగాయి. ఆ స‌మ‌యంలో హేమ స్పందిస్తూ.. నా కూతురిని పూరీ త‌న‌యుడికి ఇచ్చి పెళ్లి చేస్తామ‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేద‌ని పేర్కొంది. అయితే ఇంత అంద‌మైన కూతురిని పెట్టుకొని లేని పోని వివాదాల‌లో ఎందుకు ఇరుక్కుంటున్నావ్ అని కొంద‌రు నెటిజన్స్ ఆమెకి నీతులు చెబుతున్నారు.

Latest News