Hema| న‌టి హేమ‌కి మ‌రోసారి నోటీసులు.. ఈ సారైన హాజరు అవుతుందా?

Hema| బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి వైద్యపరీక్షలు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు ల్యాబ్ నుంచి రిపోర్టులు తెప్పించ‌గా అందులో హేమ‌కి పాజిటివ్‌గా ని

  • Publish Date - May 29, 2024 / 11:29 AM IST

Hema| బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి వైద్యపరీక్షలు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు ల్యాబ్ నుంచి రిపోర్టులు తెప్పించ‌గా అందులో హేమ‌కి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దాంతో హేమ‌కి నోటీసులు పంపారు బెంగ‌ళూరు పోలీసులు. అయితే నటి హేమ తాను విచారణకు హాజరుకాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిందని పోలీసు అధికారులు తెలిపారు. తనకు అనారోగ్యంగా ఉందని, ఇతర కారణాలు చూపిస్తూ విచారణకు హాజరుకాలేని హేమ త‌న లేఖ‌లో పేర్కొంది. ఈ మేరకు హేమ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న బెంగ‌ళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మరి జూన్ 1న హేమ విచారణ కోసం బెంగళూరు వెళతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

బెంగుళూరు రేవ్‌ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమతోపాటు దాదాపు 150 మంది హాజ‌రైన‌ట్టు తెలిసింది. వారంద‌రికి రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించి పరీక్షించింది ఈ రక్త నమూనాలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు.. మొత్తం 86 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు నార్కోటిక్ టీమ్ వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీ రోజుకొక మలుపు తిరుగుతోంది. రేవ్ పార్టీ కేసులో నటి హేమను అరెస్టు చెయ్యకూడదని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బెంగళూరు సీసీబీ పోలీసులపై ఒత్తిడి తెస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఆ రాజకీయ నాయకులు ఎవరు ?, ఎందుకు నటి హేమను వదిలేయాలని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు అనేది తెలియ‌డం లేదని ఓ పోలీసు అధికారి చెబుతున్న‌ట్టు క‌న్న‌డ మీడియా ప్ర‌సారం చేసింది.బెంగళూరు రేవ్ పార్టీకి, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులకుఈ డ్ర‌గ్స్ కేసులో ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలో కూడా బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారని టాక్ న‌డుస్తుంది.

Latest News