Site icon vidhaatha

Hyper Aadi| పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ హైప‌ర్ ఆది బెదిరింపుల‌కి దిగుతున్నాడా..!

Hyper Aadi| గ‌త ఎన్నిక‌ల‌లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ప‌వన్ క‌ళ్యాణ్ ఈ సారి పిఠాపురంలో పోటీ చేశాడు. ఆయ‌న 70 వేల మెజారిటీతో గెలుపొందాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం ప‌ద‌వితో పాటు ప‌లు శాఖ‌లు కేటాయించారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖాళీ లేకుండా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప‌వన్ క‌ళ్యాణ్ గెలుపు కోసం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు కూడా ఎంతో కృషి చేశారు. పవన్ కళ్యాణ్ వీర విధేయుడు.. జనసైనికుడు.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పిఠాపురం వెళ్లి అక్క‌డ ప‌వ‌న్ కోసం ప్ర‌చారం చేయ‌డం మ‌నం చూశాం.

ఎమ్మెల్యేగా హైప‌ర్ ఆది టిక్కెట్ ఆశించ‌గా, కూట‌మి స‌ర్ధుబాటు వ‌ల‌న టిక్కెట్ రాలేదు. అయితే త‌న‌కి టిక్కెట్ రాక‌పోయిన కూడా హైప‌ర్ ఆది జ‌న‌సేన నాయ‌కులు అంద‌రు గెల‌వ‌డంతో పాటు ప‌వ‌న్ గెలిచి డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కించుకోవ‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక హైప‌ర్ ఆది ఇప్పుడు ఓ షోలో పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ బెదిరింపుల‌కి దిగ‌డం చర్చనీయాంశం అయింది. బుల్లితెర పాపుల‌ర్ షో ఢీ లో పండు టీమ్‌తో క‌లిసి హైప‌ర్ ఆది స్కిట్ ప్ర‌ద‌ర్శించారు.. ఆ స‌మ‌యంలో అంద‌రు కింద కూర్చొని ఉండ‌గా, అప్పుడే వచ్చిన హైపర్‌ ఆది, ఏంట్రా బంతిభోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అని అంటాడు.

అప్పుడు ఛాలెంజ్ మ‌ర‌చిపోయావా, ఓడిపోయిన వాళ్లు వ‌చ్చి ఇక్క‌డ కూర్చోవాలి. లాస్ట్ రౌండ్ మ‌న‌మే గెలిచాం అంటాడు పండు . దీంతో `ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గులేదా మీకు అంటూ ఫైర్‌ అయ్యాడు. మరో మాస్టర్‌ని పట్టుకుని నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా? ఏదో ఫ్యామిలీ ప్లానింగ్‌ అయిపోయాక.. ఆరెంజ్‌ జ్యూస్‌, ఐదు వందల రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్‌ అనడంతో న‌వ్వులు పూసాయి. ఇంత‌లో పండు అందుకొని నువ్వు ఎంత చెప్పిన త‌గ్గేదేలే అని అన్నాడు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అంటూ హైపర్‌ ఆదిని బెదిరించాడు పండు మాస్టర్‌. అప్పుడు `రేయ్‌ మనం ఎవరి తాలూకో తెలుసా? నీకు పిఠాపురం గుర్తుందా అంటూ వార్నింగ్‌ ఇస్తూ వెళ్లిపోయాడు హైపర్‌ ఆది. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే ప‌వన్ క‌ల్యాణ్ పేరు చెప్పి బెదిరింపుల‌కి దిగిన‌ట్టు కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version