Naga chaitanya – Shobitha | హీరో నాగచైతన్య( Naga chaitanya ), హీరోయిన్ సమంత( Samantha )ల బంధం గురించి అందరికి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు( Divorce ) తీసుకున్నారు. టాలీవుడ్‌లో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. 2017 అక్టోబర్‌లో పెళ్లి చేసుకోగా, 2021లో విడాకులు తీసుకున్నారు. 2021 నుంచి ఒంటరిగా ఉంటున్న నాగచైతన్య.. అందరూ ఊహించినట్లే శోభితా ధూళిపాళ్ల( Shobitha Dhulipala ) ను వివాహమాడబోతున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు మూడేండ్ల తర్వాత శోభితాతో నాగచైతన్య నిశ్చితార్థం( Naga chaitanya – Shobitha Engagement ) జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.
శోభితా ధూళిపాళ్ల – నాగచైతన్య నిశ్చితార్థం వేడుక గురువారం ఉదయం 9:42 గంటలకు జరిగినట్లు హీరో నాగార్జున( Nagarjuna ) ఎక్స్‌వేదికగా ప్రకటించారు. దీంతో వారి ఎంగేజ్‌మెంట్ అధికారికంగా ధృవీకరించినట్లు అయింది. శోభితా ధూళిపాళ్లను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో జీవించాలి. ఇద్దరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక శోభితా ధూళిపాళ్ల నాగచైతన్య కంటే ఆరేండ్లు చిన్న. నాగచైతన్య 1986లో జన్మించగా, శోభిత 1993లో జన్మించారు. ఇక సమంత, నాగచైతన్య మధ్య వయసు తేడా కేవలం ఏడాది మాత్రమే. సమంత 1987లో జన్మించారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే జీవిస్తోంది.
ఎవరీ శోభితా ధూళిపాళ్ల..?
శోభితా ధూళిపాళ్ల స్వస్థలం.. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి( Tenali ). వేణుగోపాల్ రావు, శాంత దంపతులకు 1993, మే 31న జన్మించారు. వైజాగ్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదివింది. ముంబై యూనివర్సిటీ పరిధిలోని హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పట్టా పుచ్చుకుంది. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నారమె. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు.
2016లో తొలిసారిగా నటించారు శోభితా ధూళిపాళ్ల. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో ‘రామన్ రాఘవ్’ చిత్రం చేశారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. 2018లో తెలుగులో వచ్చిన ‘గూఢాచారి’, 2022లో వచ్చిన ‘మేజర్’ సినిమాలతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.