Jabardasth Naresh Marriage | న‌వ్య‌తో జ‌బ‌ర్ద‌స్త్ న‌రేశ్ పెళ్లి..! ఈ ఆదివార‌మే..!!

Jabardasth Naresh Marriage | జ‌బ‌ర్ద‌స్త్ న‌రేశ్( Jabardasth Naresh )ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. న‌వ్య( Navya ) అనే అమ్మాయి అత‌న్ని పెళ్లాడ‌బోతుంది. ఈ పెళ్లి చూపుల వ్య‌వ‌హారానికి శ్రీదేవి డ్రామా కంపెనీ( Sri Devi Drama Company ) వేదికైంది. ఇందుకు సంబంధించిన ప్రోమో అంద‌ర్నీ క‌ట్టిప‌డేస్తుంది. మ‌రి మీరు ఓ లుక్కేయండి.

Jabardasth Naresh Marriage | ఈటీవీ విన్ ద్వారా ప్ర‌సార‌మ‌య్యే శ్రీదేవి డ్రామా కంపెనీ( Sri Devi Drama Company ) అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఈ వేదిక‌పై ప‌లు ర‌కాల ప్రోగ్రామ్స్ చేస్తూ అంద‌ర్నీ క‌డుపుబ్బా న‌వ్విస్తుంటారు. అంతేకాదు ఎన్నో ఎమోష‌న్ డ్రామాల‌కు కూడా వేదికైంది. తాజాగా మ‌రోసారి పెళ్లి వాతావ‌ర‌ణం నెల‌కొంది శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక‌పై. జ‌బ‌ర్ద‌స్త్ న‌రేశ్( Jabardasth Naresh ) – న‌వ్య( Navya ) పెళ్లికి వేదికైంది. ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం(అక్టోబ‌ర్ 19) టెలికాస్ట్ కానుంది. అయితే గ‌తంలో ఇదే వేదిక‌పై సుధీర్ – ర‌ష్మీ స‌ర‌దాగా చేసిన పెళ్లి ఎంతో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం గుర్తుంది క‌దా..? మ‌రి ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ న‌రేశ్ – న‌వ్య పెళ్లి కూడా అలా స‌ర‌దాగా చేసిందా..? లేదంటే నిజంగానే చేశారా..? అనేది తెలియాలంటే ఆదివారం వెయిట్ చేయాల్సిందే.

ఇక ప్రోమో విష‌యానికి వ‌స్తే.. హైప‌ర్ ఆది ప్ర‌కట‌న‌తో జ‌బ‌ర్ద‌స్త్ న‌రేశ్ పెళ్లి ప్రోమో సాగుతోంది. ‘మా అందరికీ ఒక ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది. నరేష్‌ను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాళ్లు కూడా ఇక్కడికే వచ్చారు!’ అని ఆది చెప్పడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికంతా ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయింది. ఆ తర్వాత అమ్మాయిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి, లైవ్ పెళ్లి చూపులు మొదలుపెట్టారు. నవ్య–నరేష్ పేర్లు కలుస్తున్నాయి అంటూ హైప‌ర్ ఆది నవ్వులు పూయించాడు.

ఇక అందంగా ముస్తాబైన న‌వ్య అనే అమ్మాయి కూడా నరేష్ వైపు తిరిగి..’నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చా. లవ్ యూ… లవ్ యూ ఫరెవర్!” అని ప్రపోజ్ చేసింది. సిగ్గుతో తల వంచిన నరేష్ కూడా తడుముకోకుండా.. ‘నాకు కూడా మీరు బాగా నచ్చారు’ అని సమాధానం ఇచ్చాడు. అంతలో “ఏమ్మా! నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తావా?” అని అన్నపూర్ణమ్మ సరదాగా అడిగింది. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ.. “నరేష్‌కి ఏది ఇష్టమైతే, అదే నాకూ ఇష్టం!” అని బదులిచ్చింది.

ఈ సరదా పెళ్లి వాతావరణంలో నరేష్ తండ్రి కాస్త ఎమోషనల్ అయ్యారు. “నా కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సీన్ చూసి నాకు నిజంగా ఆనందంగా ఉంది” అని చెప్పడంతో స్టేజ్‌ ఎమోషనల్‌ మోడ్‌లోకి వెళ్లింది. హాస్యం, హృదయాన్ని తాకే ఎమోషన్‌.. రెండూ కలిసిన ఈ ఎపిసోడ్‌ నరేష్ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మారిపోయింది. మరి ఇవి ఉత్తుత్తి పెళ్లి చూపులా..? లేదా నిజంగానే పెళ్లి చూపులు ఇలా ప్లాన్ చేశారా అనేది చూడాలి.