Site icon vidhaatha

Janhvi Kapoor| అంబానీ పెళ్లిలో వెన‌కాముందు ఆలోచించ‌కుండా ఫుల్‌గా లాగించేసిన జాన్వీ..ఆసుపత్రిలో చికిత్స‌

Janhvi Kapoor| శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. త‌న అందచందాల‌తోనో లేదంటే సినిమా ప్రాజెక్ట్‌ల విష‌యంలోనో, ఇత‌ర అంశాల‌కి సంబంధించిన వాటితో జాన్వీ పేరు తెగ మారుమ్రోగిపోతూ ఉంటుంది. జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం సినిమాల‌తో చాలా బిజీగా ఉంది.ఆమె ప్రధాన పాత్ర పోషించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం మే నెలలో రిలీజ్ కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని బాగానే అల‌రించింది. ఇక జాన్వీ లీడ్ రోల్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ఉల్జా ట్రైలర్ ఇటీవలే రాగా, సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఇక ప్ర‌స్తుతం తెలుగులో ఎన్టీఆర్ స‌ర‌సన దేవ‌ర చిత్రం చేస్తుంది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్‌తో కూడా సినిమా చేయ‌నుంది. మ‌రి కొన్ని సినిమాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే జాన్వీ కపూర్ ఇటీవ‌ల అనంత్ అంబాని- రాధిక పెళ్లిలో సంద‌డి చేయ‌డం మ‌నం చూశాం. చాలా అందంగా రెడీ అయి పెళ్లికి హాజ‌రైంది. అక్క‌డ బాగానే సంద‌డి చేసింది. అయితే ఆ పెళ్లి త‌ర్వాత జాన్వీ క‌పూర్ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు తెలుస్తుంది. క‌ల్తీ ఆహారం వల్ల జాన్వీ కపూర్‌కు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయిందని ,ఆ కారణంగానే ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. జాన్వీ కపూర్ ఈ రోజు (జూలై 19) ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కానున్నారట. అయితే జాన్వీ ఆసుప‌త్రిలో చేరింద‌ని తెలుసుకున్న కొంద‌రు నెటిజ‌న్స్ అంబాని పెళ్లిలో వెన‌క ముందు ఆలోచించ‌కుండా అంబానీ పెళ్లిలో ఫుల్‌గా లాగించేసి ఉంటుంది, అందుకు ఫుడ్ పాయిజ‌న్ అయి ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక రెండు మూడు రోజుల పాటు జాన్వీ రెస్ట్ తీసుకోనుంద‌ని, ఆ త‌ర్వాత తిరిగి త‌ను క‌మిటైన ప్రాజెక్ట్‌లు పూర్తి చేయ‌నుంది. జాన్వీ న‌టిస్తున్న తాజా చిత్రం ఉల్జా చిత్రంలో డిప్యూటీ హైకమిషనర్ సుహానా భాటియా క్యారెక్టర్‌లో నటించారు. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ చిత్రంగా రూపొందించారు దర్శకుడు సుధాన్షు సారియా. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌తో పాటు రోషన్ మాథ్యూ, గుల్షన్ దేవైయా ప్రధాన పాత్రలు చేశారు. ఆదిల్ హుసేన్, మియాంగ్ చాంగ్, రాజేశ్ తైలంగ్, రాజేంద్ర గుప్తా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాశ్వత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై వినీత్ జైన్ నిర్మించారు

Exit mobile version