Janhvi Kapoor| అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫ్యూచర్ స్టార్ హీరోయిన్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు ఇప్పుడు సౌత్, నార్త్‌లో తన హవా చూపిస్తుంది. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది.తన ఫొటోల గురించి మాట్లాడిన జాన్వీ కపూర్.. సాధారణంగా ఫ్యాన్స్ సెలబ్రిటీల కొత్త పిక్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే ఫొటోగ్రాఫర్స్ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించిన క్లిక్కుమనిపిస్తారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం 25 సార్లు ఫ్లైట్‌లో ప్రయాణించాను.
అయితే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేసరికి అక్కడ ఫొటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు. ఇక సెలబ్స్ కోసం ఫొటోగ్రాఫర్స్ ఎదురు చూసే మరొక ప్రాంతం జిమ్. మేము జిమ్‌కి వెళ్లినప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు వేసుకొని వెళతాం. అప్పుడు ఫొటోలు తీయోద్దని చాలా సార్లు కోరాను. ఆ ఫొటోలు వైరల్ అయితే అలాంటి డ్రెస్సులే మాకు ఇష్టమని అందరు అనుకుంటారు. అందుకే జిమ్ బయట ఫొటోలు దిగడం నాకు నచ్చదు’ అని జాన్వీ చెప్పుకొచ్చింది.ఇక తనకు హిస్టరీ అంటే చాలా ఇష్టమని బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ ‘ఈ ఇద్దరి గురించి వినడం, మాట్లాడటం తనకు చాలా నచ్చుతుందని పేర్కొంది.
ఫొటోగ్రాఫర్స్ ప్రత్యేక సందర్భాలలో మాత్రమే హీరో హీరోయిన్స్ ను వెతుక్కుంటూ వస్తారు. కానీ సినిమా ప్రమోషన్ వగైరా ఉంటే డబ్బులు చెల్లించి వారిని పిలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. కాబట్టి నా ఫోటోలు క్లిక్ చేయడానికి వారు వచ్చారు. అయితే సినిమా షూటింగ్ లేనప్పుడు, నేను నా పనిలో బిజీగా ఉన్నప్పుడు వారు నా కారును ఫాలో అవుతూ కష్టపడి నన్ను ఫోటోలు తీస్తారు, దీనికి డబ్బులు తీసుకుంటుంటారు.” అంటూ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె తాజా సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈ నెల 31న విడుదల కానుంది