Site icon vidhaatha

Janhvi Kapoor| ఎన్టీఆర్‌పై జాన్వీ క‌పూర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. నాకు 10 రోజులు, ఆయ‌న‌కు ఒక్క సెక‌ను..!

Janhvi Kapoor| శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న దేవ‌ర సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అక్టోబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ చిత్రం కోసం జాన్వీ అభిమానుల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు రామ్ చ‌రణ్‌- బుచ్చిబాబు సినిమాలోను జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక బాలీవుడ్ మూవీ ‘ఉలఝ్‌’ మూవీ చేస్తుండ‌గా,ఇటీవ‌ల చిత్ర షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రం ఆగ‌స్టు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌చారంలో భాగంగా ప‌లు జాన్వీ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తుంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న దేవ‌ర సినిమా షూటింగ్‌కు సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఇటీవ‌ల ఎన్టీఆర్‌, జాన్వీల పై ఓ సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేయ‌గా, దీని గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. ఎలాంటి స్టెప్‌ను అయినా స‌రే ఎన్టీఆర్ ఒక్క సెక‌నులో నేర్చుకోగ‌ల‌ర‌ని, అదే స్టెప్పును తాను నేర్చుకునేందుకు మాత్రం 10 రోజుల స‌మ‌యం ప‌డుతుందని జాన్వీ క‌పూర్ ప్ర‌శంస‌లు కురిపించింది.. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేగాన్ని చూసి తాను ఆశ్చర్య‌పోయాన‌ని పేర్కొంది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ఎనర్జిటిక్ హీరో కాగా, ఆయన చాలా హుషారుగా ఉంటారు .ఎన్టీఆర్ రాగానే సెట్‌కే క‌ళ వ‌స్తుంద‌ని, అంద‌రూ ఉత్సాహంగా ఉంటార‌ని పేర్కొంది.. ఇక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న ఎంతో ప్ర‌శాంతంగా ఉంటార‌ని , ఏ విష‌యానైనా ఎంతో సున్నితంగా చెబుతార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా సుల‌భం అని తెలియ‌జేసింది.తెలుగు వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన జాన్వీ క‌పూర్… వారి పనితీరు నాకు చాలా నచ్చింది. వారు కళను, సినిమాను చాలా గౌరవిస్తారని తెలియ‌జేసింది. ఇతరులతో ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది జాన్వీ కపూర్. ఇక ఇటీవ‌ల ఆరోగ్య ప‌రంగా కొంచెం ఇబ్బంది ప‌డ్డట్టు చెప్పిన జాన్వీ , ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ట్లు తెలిపింది.

Exit mobile version