Janhvi Kapoor| అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం,ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ధడక్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో సౌత్‌లో అడుగుపెట్టింది జాన్వీ. ఈ మూవీ అక్టోబర్‌లో విడుదల కానుండగా, ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాలోను జాన్వీ కపూర్‌నే కథానాయికగా నటిస్తుంది.
అయితే జాన్వీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె అయినప్పటికీ అనేక అవమనాలు ఎదుర్కొందట. ఈ విషజ్ఞాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జాన్వీ, రాజ్ కుమార్ రావు కాంబోలో తెరకెక్కిన మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రం ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్.. తాను 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే తన ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టి దుష్ప్రచారం చేశారని వాపోయింది. కొందరు ఆకతాయిలు నా ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టారు. శ్రీదేవి కూతురు అని ఎంతో అసభ్యంగా వైరల్ చేయడం, వాటిని నా ఫ్రెండ్స్ చూసి స్కూల్‌కి వెళ్లినప్పుడు అవహేళనగా మాట్లాడడం చాలా బాధ కలిగించింది.
నాకు అప్పుడు వాటిపై అవగాహన పెద్దగా లేదు. ఎందుకు అవహేళన చేస్తున్నారో కూడా తెలిసేది కాదు. బాడీ షేమింగ్ చేశారు. ఎన్నో విమర్శలు చేశారు. అవన్నీ తట్టుకొని స్ట్రాంగ్‌గా నిలబడ్డాను. నాపై ట్రోలింగ్ జరిగితే భరిస్తాను కాని నా కుటుంబ సభ్యులని చేస్తే ఏ మాత్రం తట్టుకోలేను. అది నా వీక్‌నెస్ అంటూ జాన్వీ కపూర్ స్పష్టం చేసింది. జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జాన్వీ సినిమాల కన్నా సోషల్ మీడియాతోనే బాగా ఫేమస్ కావడం మనం చూశాం. ఆమె సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టి రచ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ కేక పెట్టించే లుక్స్ రచ్చ లేపుతుంటాయి.