Site icon vidhaatha

Sunny Sanskari Ki Tulsi Kumari Teaser : జాన్వీ కపూర్‌ ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ టీజర్

Sunny Sanskari Ki Tulsi Kumari teaser: Varun Dhawan and Janhvi Kapoor in the film.

విధాత : అందాల తార జాన్వీ కపూర్‌(Janhvi Kapoor), వరుణ్‌ ధావన్‌(Varun Dhawan) జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’(Sunny Sanskari Ki Tulsi Kumari) నుంచి మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. కరణ్ జోహర్ నిర్మాతగా.. శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కిస్తున్నప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ మూవీ దసర కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్రబృందం టీజర్ ను విడుదల చేసింది. టీజర్ సన్నివేశాలు చూస్తే ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ రోమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. కామెడీ, పంచ్ డైలాగ్ లలో టీజర్ ఎంటర్ టైన్ గా సాగి ఆకట్టుకుంది. బాహుబలి ప్రభాస్‌ గెటప్‌లో వరుణ్ ధావన్‌ నేను అచ్చం బాహుబలిలానే ఉన్నానని చెప్పగా..నిన్ను చూస్తే రణ్‌వీర్ సింగ్‌ ధోతిని.. ప్రభాస్‌ ధరించినట్లు ఉందంటూ చెప్పే డైలాగ్ నవ్వించేదిగా ఉంది.

మనీష్ పాల్(Manish Paul), అక్షయ్ ఒబేరాయ్(Akshay Oberoi), సన్యా మల్హోత్రా( Sanya Malhotra), రోహిత్ సరాఫ్(Rohit Saraf) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుంది. పరమ్ సుందరి సినిమాలో మలయాళీ అమ్మాయిగా చీరకట్టు, సాంప్రాదాయ దుస్తులతో కనిపించిన జాన్వీ ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ మోడ్రన్ డ్రస్ లలో గ్లామర్ ఒలకబోసింది. ఈ రెండు సినిమాలు కూడా ప్రేమ, కామెడీ నేపథ్యంలోనే రూపొందడం విశేషం.

Exit mobile version