Jani Master|ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్(choreographer) జానీ మాస్టర్ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితం. ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కూడా చేరి పవన్ కోసం గట్టిగానే ప్రచారం చేశారు. అయితే తన దగ్గర పనిచేస్తున్న జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్ 36 రోజుల పాటు జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్ పై కేసు, మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆయన తల్లి నెల్లూరులో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అలాగే ఆయన భార్య కూడా తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పదే పదే చెప్తున్నారు. అయితే ఎట్టకేలకి జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదలయ్యాడు.
తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్ కు(Jani Master) రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల క్రితం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయగా రెండు వారాల పాటు ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే రిలీజైన తర్వాత జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా తనని ట్రెండింగ్ లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టారు.కార్తీక్ ఆర్యన్ నటించిన హిందీ మూవీ భూల్ భులయ్యా 3కి కొరియోగ్రఫీ అందించగా, ప్రస్తుతం ఆ సినిమాలోని టైటిల్ ట్రాక్ హరే రామ్ హరే రామ్ ట్రెండ్ అవుతోంది. దీంతో జానీ మాస్టర్ ఆ పోస్ట్‌ని షేర్ చేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది.
ఇక ఇదిలా ఉంటే జైలు నుంచి బయటకొచ్చిన జానీ మాస్టర్ తన సన్నిహితులని కలిసి బాధని పంచుకున్నట్టు తెలుస్తుంది. జైలులో నరకం చూశాను. ఆహారం బాగోలేదు. మనిషన్న వాడు ఎవడు జైలు(Jail)కి వెళ్ళకూడదు. ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు. కొన్ని రోజులు మనిషిని కాలేను. రెండు రోజుల వరకు ఎవరితో మాట్లాడను. మీడియా ముందుకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. త్వరలో అన్ని విషయాలు బయటపెడతాను… అన్నాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొందరు జానీ మాస్టర్‌కి తమ సపోర్ట్ అందిస్తున్నారు.