Janhvi Kapoor| ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఇంట గత కొద్ది రోజులుగా పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం ముంబైలో జూలై 12న జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా అంబాని ఇంట గుజరాతీ సాంప్రదాయం ప్రకారం మామేరు వేడుక నిర్వహించారు. దీనికి బాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. జాన్వీ కపూర్ కూడా ఈ వేడుకకి జరయ్యారు. పెళ్లి వేడుక కావడంతో ట్రెడిషనల్ వేర్ ఎంచుకుంది. ఆరంజ్ కలర్ డిజైనర్ చోళీ లెహంగా, దుప్పట్టాలో మెరిసిన జాన్వీ మెడలో ఒక నెక్లెస్ కూడా ధరించింది.
జాన్వీ కపూర్ గ్రౌండ్ లెహంగాకు సరిపోయేలా మెడలో చోకర్ నెక్లెస్ ధరించింది. ఈ చోకర్ జాన్వీ కపూర్ అందాన్ని పెంచడమే కాక అందరి దృష్టిని ఆకర్షించింది. అయతే ఈ ఖరీదైన నెక్లెస్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 52 లక్షలు. ఈ అందమైన చోకర్ ధర విని అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ నెక్లెస్ ధరకే ఇల్లు కట్టుకోవచ్చని కొందరు ముచ్చటించుకుంటున్నారు. శ్రీమంతుడి ఇంట్లో వేడుకకి ఈ మాత్రం కాస్ట్‌లీ జ్యూవలరీ అయిన ధరించి వెళ్లాలి కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకకి జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో రావడం విశేషం.
ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ దేవర అనే సినిమాతో పాటు రామ్ చరణ్ 16వ సినిమాతో బిజీగా ఉంది. దేవరలో ఎన్టీఆర్‌కి జంటగా నటిస్తుండగా, ఈ మూవీని అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక రామ్ చరణ్ 16వ చిత్రానికి జాన్వీ కపూర్ సైన్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. బాలీవుడ్ లో ఇంతవరకు ఒక్క స్టార్ హీరో పక్కన కూడా నటించని జాన్వీ కపూర్ సౌత్ లో పాన్ ఇండియా హీరోలతో జతకడుతుండడం చర్చనీయాంశంగా మారింది.