Pawan Kalyan| విపక్ష నేతగా ఇన్నాళ్లు పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడిగా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందుతున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను స్వీకరించి తన ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జనసేనాని. అయితే ఏపీలో కూటమి విజయం సాధించడంలో ముఖ్య భూమిక పవన్ కళ్యాణ్ పోషించారు. జగన్‌కు ఈ సారి పదవి దక్కకుండా చేసి ఆయనకి 11 మంది ఎమ్మెల్యేలే దక్కడానికి పవన్ కళ్యాణే కారణమని ఆ పార్టీకి చెందిన కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు.
డిప్యూటీ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి బాగోతాలను తవ్వి తీసే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయనపై కొందరు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో కీలక నేతగా ఉండటంతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి మద్ధతుదారుడు కావడంతో పవన్‌ను మావోయిస్టులు, కొన్ని రకాల శక్తులు టార్గెట్ చేశాయన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో హెచ్చరించింది. విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే పవన్‌ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి, వీటి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని కూడా వారు తెలియజేశారు.
అయితే పవన్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అందరు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్ట్లా ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేనరని జయశంకర్ తెలిపారు. భద్రత విషయంలో పవన్ చాలా జాగ్రత్తగా ఉంటారని, వంగవీటి మోహన రంగా లాగా రోడ్డుపైకొచ్చి నిరాహారదీక్ష చేయరని చెప్పుకొచ్చారు. లడ్డూలాగా పవన్ దొరకడని, ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరని జయశంకర్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలిచ్చేవారు ఉన్నారని, జనాలకు మంచి చేయాలని తపించే అలాంటి నాయకుడిని కాపాడుకోవాలని సూచించారు. కష్టంలో పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడటమే నిజమైన అభిమానమని జయశంకర్ పేర్కొన్నారు.