విధాత : తేజ సజ్జా, రితికా నాయక్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘మిరాయ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇటీవల విడుదలైన మిరాయ్ సినిమా బాక్సాఫిస్ వద్ధ మంచి వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి మిరాయ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ సంస్థ ఓ పోస్టర్ పంచుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు జియో హాట్‌స్టార్ తెలిపింది.
ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన మిరాయ్ సినిమా కథలోకి వెళితే..సామ్రాట్ ఆశోక తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసిన దైవ శక్తిని సాధించి అమరాత్వాన్ని సాధించేందుకు దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు. ఆ గ్రంధాల రక్షకులలో ఒకరైన అంబిక (శ్రియ)..తన జ్ఞాన దృష్టితో మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును ముందే చూసి..మహావీర్ ను ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద (తేజ సజ్జా)ను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది. ఆ తర్వాతా ఎక్కడెక్కడో పెరిగిన వేద..తన తల్లి ఆశయాన్ని తెలుసుకుని..మహవీర్ లామా నుంచి పవిత్ర తొమ్మిది గ్రంథాలను ఎలా రక్షించాడన్నదానిపై సినిమా కొనసాగుతుంది. ఈ సినిమాలోని వైబ్ ఉంది బేబీ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.