Salam Anali | విధాత : బాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఎంట్రీ ఇచ్చిన వార్ 2(War2) సినిమా నుంచి తాజాగా ‘దునియా సలాం అనాలి’ (Dunia salam Anali) అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్(NTR, Hrithik Roshan) లు ఇద్దరు పోటాపోటి స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ పాట హుషారెత్తిస్తూ దూసుకపోతుంది. అయితే పూర్తి పాటను మాత్రం విడుదల చేయడం లేదని థియేటర్‌లోనే చూడాలని చిత్రబృందం కోరింది. హిందీలో హృతిక్, తెలుగులో ఎన్టీఆర్ డ్యాన్స్ లో మేటిగా భావిస్తుంటారు. అలాంటి ఇద్దరు ఒకే సినిమాలో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ పాటపై వారి అభిమానులలో ఆసక్తి వ్యక్తమవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి కియారా అద్వానీ, హృతిక్ రోషన్ లు నటించిన హిందీ సాంగ్ ‘అవాన్ జవాన్’(Aavan Jaavan)..తెలుగులో నీ గుండె గుమ్మంలోకి పాట యూత్ ను ఆకర్షిస్తూ సినిమాపై క్రేజ్ పెంచింది. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల పాటతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ నెల 14న వార్ 2 ప్రేక్షకులకు ముందు రానుంది.