Devara | యంగ్ టైగర్ ఎన్టీర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఒకేసారి విడుదలైంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న మూవీ, పాటు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ అనంతరం ఎన్టీఆర్ చేసిన తొలి చిత్రం ఇదే. జక్కన్న మూవీలో హీరోగా చేసిన నటుడు ఏ సినిమా చేసినా ప్లాఫ్‌గా నిలిచాయి. ఈ క్రమంలో కొరటాల, ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కొరటాల శివ దేవర మూవీని ప్రకటించిన నాటి నుంచే ఆసక్తి నెలకొన్నది. పోస్టర్స్, పాటలు సినిమా వచ్చిన సమయంలో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, ఆ తర్వాత హైప్ పెరుగుతూ వచ్చింది. సినిమా విషయంలోనూ అచ్చం అలాగే జరిగింది.
సినిమా చూసిన పలువురు అభిమానులు మూవీ ఎంటీ ఇలా ఉందన్నారు. టెక్నికల్‌గా సినిమా ఓ రేంజ్‌లో ఉన్నా.. జనాల్లోకి పెద్దగా ఎక్కలేదు. సెకాండ్ హాఫ్‌కి లీడ్ ఇచ్చే క్లిఫ్ హ్యాంగర్ ఆసక్తికరంగా అనిపించలేదు. అయితే, ప్రస్తుతం మూవీ చాలామంది అభిప్రాయం మారింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ దాదాపుగా రూ.400కోట్లకు వరకు చేరాయి. సత్యం సుందరం సైతం ఇటీవల విడుదలైంది. దేవరతో పోలిస్తే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ వారం పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేందుకు అవకాశాలు లేవు. ఈ నెల 10న రజనీకాంత్ వెట్టయాన్ మూవీ రిలీజ్ కానున్నది. ఇది దేవర మూవీ టీమ్‌కి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్‌తో మూవీ కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉన్న టాక్ ఇలాగే కొనసాగితే.. దగ్గరదగ్గర రూ.వెయ్యికోట్ల గ్రాస్‌ని రాబట్టవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. మరి దేవర భారీ టార్గెట్‌ని రీచ్ అవుతాడా? లేదా? చూడాల్సిందే.