Site icon vidhaatha

కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్నా జూనియర్ పవర్ స్టార్

విధాత:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్..జూనియర్ పవర్ స్టార్ వచేస్తున్నాడని ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రతేక శిక్షణ పొందిన విషయం తెల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన తనయుడు అకీరా నందన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం అవుతుందని వార్తలు వస్తున్నాయి. అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చేముందు తన తండ్రి మాదిరిగానే యాక్టింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే కర్ర సామును కూడా నేర్చుకుంటున్నాడు. తాజాగా అకీరా కర్ర సాము ప్రాక్టీస్ చేస్తుండగా, తల్లి రేణు దేశాయ్ ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ట్రెండ్ అవుతుంది. కాగా పవన్ నట వారసుడి ఎంట్రీ అతి త్వరలో ఉండబోతోందని సమాచారం.

https://www.instagram.com/reel/CSEupmYiBDD/?utm_source=ig_web_copy_link

Exit mobile version