Site icon vidhaatha

Kalki 2898 AD| క‌ల్కి చెత్త‌ రికార్డ్.. మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుండి ఇదే అత్య‌ల్ప క‌లెక్ష‌న్

Kalki 2898 AD| నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, దీపికా ప‌దుకొణే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం క‌ల్కి. 1985లో కల్ట్‌ క్లాసిక్‌ గెరాఫ్తార్‌లో కలిసి నటించినక‌మ‌ల్,అమితాబ్ వంటి లెజెండ్‌ ద్వయం దాదాపు 39 సంవత్సరాల తరువాత ఈ సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం విశేషం. జూన్‌ 27న విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. నాగ్‌ అశ్విన్‌. ప్రియాంకదత్‌, స్వప్నాదత్‌లు దాదాపు 600 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం సునాయాసంగా వెయ్యి కోట్లు రాబ‌డుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని సినిమా రిలిజై దాదాపు రెండు వారాలు దాటగా, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 840 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది.

క‌ల్కి విడుదలైన 13వ రోజు ఇండియాలో దాదాపు రూ.9 కోట్ల నెట్ వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇది 12వ రోజుతో (రూ. 10.4 కోట్లు) పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బుల్ డిజిట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన క‌ల్కి చిత్రం 13వ రోజు మాత్రం సింగిల్ డిజిట్‌కి చేరింది. ఇందుకు కార‌ణం ఇంకా టిక్కెట్ రేట్స్ త‌గ్గించ‌క‌పోవ‌డ‌మే అంటున్నారు. ఇంత రేటికి మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రేక్ష‌కులు థియేట‌ర్ వైపు చూడ‌క‌పోవ‌డం వ‌ల‌న క‌లెక్ష‌న్స్ డ్రాప్ అవుతున్నాయ‌ని అంటున్నారు. ఇక 13వ రోజున క‌ల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.05 కోట్లు రాబ‌ట్టగా, హిందీ నుంచి రూ. 5.75 కోట్లు, తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‌లు వరుసగా ₹ 0.6 కోట్లు, ₹ 0.1 కోట్లు మరియు ₹ 0.5 కోట్లు రాబ‌ట్టింది. మొదటి వారంలో, క‌ల్కి చిత్రం భారతదేశంలో ₹ 414 కోట్లు వసూలు చేసింది, తెలుగులో ₹ 212.25 కోట్లు, హిందీ ₹ 162.5 కోట్లు, తమిళం ₹ 23.1 కోట్లు, కన్నడ ₹ 2.8 కోట్లు మరియు మలయాళం ₹ 14.2 కోట్లు వ‌సూలు చేసింది.

క‌ల్కి నిర్మాణ సంస్థ సోమ‌వారం రోజు ఈ చిత్రం 900 కోట్ల క్ల‌బ్‌లోకి ప్ర‌వేశించింద‌ని, ఈ మార్కు అధిగ‌మించిన‌ ప‌ద‌వ భారతీయ చిత్రం అని ప్ర‌క‌టించారు. 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. కల్కి సినిమాకు 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 166.10 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి రూ. 30.10 కోట్లు, తమిళనాడు నుంచి 19 కోట్లు కేరళ నుంచి 10.10 కోట్లు, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 115.60 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి.మొత్తంగా ఈ సినిమాకి భారత్‌లో మొత్తం రూ. 529.45 కోట్ల వసూళ్లు వచ్చాయి. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకు 450.40 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 871.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.అయితే ఈ సినిమా మేకర్స్ సోషల్ మీడియాలో ‘ఎపిక్ మహా బ్లాక్బస్టర్ కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు కలెక్ట్ చేసింది అని ప్ర‌క‌టించ‌డం విశేషం.

Exit mobile version