KALKI 2898 AD| ఊపందుకున్న క‌ల్కి ప్ర‌మోష‌న్స్.. ప్రోమోతో ప్రభాస్‌ ఫ్యాన్స్ కి ట్రీట్ అందించిన మేక‌ర్స్

KALKI 2898 AD| స‌లార్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు క‌ల్కి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా జూన్ 27న‌ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కల్కి అంటే ఎవరు? కలియుగాంతంలోనే తన దర్శనం కలుగుతుందా.. అసలు కలియుగం అంతమవ్వడానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయనే అంశాలు

  • Publish Date - June 15, 2024 / 06:02 PM IST

KALKI 2898 AD| స‌లార్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు క‌ల్కి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా జూన్ 27న‌ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కల్కి అంటే ఎవరు? కలియుగాంతంలోనే తన దర్శనం కలుగుతుందా.. అసలు కలియుగం అంతమవ్వడానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయనే అంశాలు కూడా ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.చిత్రంలో ప్ర‌భాస్ భైర‌వ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న‌కి బుజ్జి అనే వాహ‌నం కూడా ఉంటుంది. ఇటీవ‌ల బుజ్జి వాహ‌నం లాంచింగ్ కోసం పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు.

ఇక ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల చేసి క‌థ ఏంట‌నే దానిపై ఆస‌క్తిని పెంచారు. ఇక తాజాగా `భైరవ ఆంథెమ్‌ని మొదటి పాటగా విడుదల చేయబోతున్న‌ట్టు తెలియ‌జేసి సాంగ్‌ ప్రోమో విడుద‌ల చేశారు. పాపులర్‌ సింగర్‌ దిల్జిత్‌ దోసాంజే ఆలపించిన ఈ పాటలో ప్రభాస్‌ కనిపిస్తుండటం విశేషం. దిల్జిత్‌ దోసాంజే తనదైన యాప్ట్ గెటప్‌లో నల్ల కోట్‌, సిక్క్‌ పాగా ధరించారు. మరోవైపు ప్రభాస్‌ యోధుడిని తలపించే కాస్ట్యూమ్స్ తో క‌నిపించి అభిమానుల‌కి మంచి ట్రీట్ అందించారు. ఇద్ద‌రు వ‌చ్చి చివ‌రలో హ్యాండ్ అందించుకోవ‌డం అంద‌రిని అల‌రించింది.ఇక ఈ పాట సినిమాకి ఊపు తెచ్చేలా ఉంటుందని తెలుస్తుంది.

భైర‌వ‌ పాత్ర పోషిస్తున్న ప్ర‌భాస్ తీరుతెన్నులను, హీరోయిజాన్ని, మ్యానరిజాన్ని తెలియజేసేలా ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. ఇక సాంగ్‌ ప్రోమో లిరిక్‌ హిందీలో ఉంది. ఈ పూర్తి పాటని రేపు(ఆదివారం) విడుదల చేయబోతున్నారు. ఇందులో ప్రభాస్‌ పూర్తిగా కనిపిస్తాడు. దీనికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. ఈ సినిమాని ఈనెల 27న విడుదల చేయబోతున్నారు. భారీ స్థాయిలో గ్లోబల్‌ ఫిల్మ్ రేంజ్‌లో మూవీ విడుద‌ల కానుంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ని జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. దాన్ని ఎలా కన్విన్స్ చేస్తారనేది ప్రశ్న. గతాన్ని, భవిష్యత్‌ని ఎలా లింక్‌ చేస్తాడనే ఉత్సుకత ఉంది. సుమారు ఏడువందల కోటతో అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మించారు. ఇందులో ప్రభాస్‌తోపాటు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, శోభన ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News