Kalki 2898 AD| క‌ల్కి సీక్వెల్ టైటిల్ ఇదేనా.. అభిమాని వివ‌ర‌ణ‌కి నాగ్ అశ్విన్ ఫిదా

Kalki 2898 AD| కల్కి 2898 ఏడి... ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ రోజు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని చాలా అత్య‌ద్భుతంగా రూపొందించాడు. భైర‌వ‌గా ప్ర‌భాస్, అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్‌,సుమ‌తిగా దీపికా ప‌దుకొణే తమ పాత్రల్లో జీవించారు..

  • Publish Date - June 27, 2024 / 10:35 AM IST

Kalki 2898 AD| కల్కి 2898 ఏడి… ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ రోజు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని చాలా అత్య‌ద్భుతంగా రూపొందించాడు. భైర‌వ‌గా ప్ర‌భాస్, అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్‌,సుమ‌తిగా దీపికా ప‌దుకొణే తమ పాత్రల్లో జీవించారు.. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. సెట్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం, కాస్ట్యూమ్స్ ఇలా ఎందులో కూడా వంక పెట్టే ప్ర‌స‌క్తి లేదు. అయితే సినిమాలో కొన్ని విషయాల గురించి ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేద‌ని కొంద‌రి అభిప్రాయం.

అన్ని వ‌నరుల‌ని కోల్పోయి నిర్జీవంగా కాశీ ప‌ట్ట‌ణం ఉంటుంది. అక్క‌డ కాంప్లెక్స్‌ అనే అద్భుత‌మైన లోకాన్ని సుప్రీం యాస్కిన్‌ (కమల్‌హాసన్‌) సృష్టించి ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తుంటాడు. అయితే కాంప్లెక్స్ కింద ఉండే భూమి మీద ప్ర‌జ‌లు చాలా క‌ష్టాల‌లో ఉంటారు. అయితే భైరవ (ప్రభాస్)కి కాంప్లెక్స్‌ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన కొన్ని నాట‌కీయ పరిణామాల నేప‌థ్యంలో మళ్లీ 6000 వేల సంవత్సరాల తర్వాత కల్కి (దేవుడు) రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్‌ మనుషులకు తెలుస్తుంది. అయితే సుమతి (దీపికా పదుకొనే) కడుపులోని దేవుడ్ని కాపాడటానికి అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) అండ‌గా ఉంటాడు. భైర‌వ అడ్డుప‌డుతూ ఉంటాడు. సినిమాలో అనేక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. క్లైమాక్స్, కురుక్షేత్ర యుద్ధం వంటివి సినిమాకి చాలా హైలైట్.

చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరిగ‌రాయ‌డానికి రెడీ అయింద‌ని తెలుస్తుంది. సినిమా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చ‌డంతో పాటు పాజిటివ్ టాక్ రావ‌డంతో మూవీ గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంద‌నే హింట్ ఇచ్చారు నాగ్ అశ్విన్. దీంతో ఇప్పుడు దానికి సంబంధించిన చ‌ర్చ న‌డుస్తుంది. సినిమా రిలీజ్‌కి ముందు ప్రభాస్, నాగ్ అశ్విన్ ఇన్‌స్టా లైవ్‌లోకి వ‌చ్చి ప‌లువురు అభిమానుల‌తో ముచ్చటించారు. ఆ స‌మ‌యంలో క‌ల్కి సీక్వెల్ పార్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాల‌ని ఓ అభిమాని సూచించాడు. ‘క‌ల్కి 3102 BC’ అయితే ఆ సీక్వెల్ పార్ట్ కి ప‌ర్ఫెక్ట్ టైటిల్ అని అన్నాడు. ఆ స‌మ‌యంలోనే మ‌హాభార‌తం జ‌రిగింది కాబ‌ట్టి శ్రీ‌కృష్ణుడు మాన‌వ‌శ‌రీరాన్ని వీడిన సంవ‌త్స‌రం అదేన‌ని.. అప్పుడే క‌లియుగం మొద‌లైంద‌ని స‌ద‌రు అభిమాని వివ‌ర‌ణ ఇవ్వడంతో నాగ్ అశ్విన్ ఇంప్రెస్ అయ్యాడు. దీంతో క‌ల్కి పార్ట్-2 సినిమాకు ఈ టైటిల్ పెట్టిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కొంద‌రు అంటున్నారు.

Latest News