Kalki 2898 AD| ఏందిది.. ప్ర‌భాస్ సినిమాకి టిక్కెట్ బుక్ చేస్తే రాజ‌శేఖ‌ర్ మూవీకి బుక్ అవుతుందా?

Kalki 2898 AD| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌బాస్, అందాల ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి 2898 ఏడి. ఇందులో అమితాబ్, క‌మ‌ల్ హాస‌న్, దిశా పటాని ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. జూన్ 27న ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మో

  • Publish Date - June 24, 2024 / 08:24 AM IST

Kalki 2898 AD| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌బాస్, అందాల ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి 2898 ఏడి. ఇందులో అమితాబ్, క‌మ‌ల్ హాస‌న్, దిశా పటాని ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. జూన్ 27న ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ మూవీ టీంకి పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. తెలంగాణలో ఆల్రెడీ కల్కి 2898 ఏడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా ఐదు గంట‌ల‌కే షోలు ప‌డుతున్నాయి. బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టిక్కెట్స్ బుక్ చేసుకునేందుకు తెగ పోటీ ప‌డుతున్నారు. అయితే ఇక్క‌డే ఓ పెద్ద ట్విస్ట్ నెల‌కొంది.

టిక్కెట్ బుకింగ్ కోసం సెర్చ్ చేస్తే ప్రభాస్ కల్కి కాకుండా.. రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కల్కి కనిపిస్తోంది. ఇక కొంద‌రు ఎక్కడ టిక్కెట్స్ అయిపోతాయేమోన‌న్న ఆతృత‌లో రాజ‌శేఖ‌ర్ క‌ల్కి బుక్ చేసుకుంటున్నాట‌ర‌. ఇది తెల‌సుకొని కొంద‌రు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.. ఇది చాలా పెద్ద ప్లానే.. బిగ్గెస్ట్ స్కాం కూడా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడు సినిమా హౌస్ ఫుల్ కాలేదని, ఇప్పుడు వ‌దిలారా అంటూ వారిని దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో బుక్ మై షోకి కంప్లైంట్ చేయ‌గా, దానిపై వారు స్పందిస్తూ ఏమి కంగారు ప‌డ‌క్క‌ర్లేద‌ని రాజ‌శేఖర్ క‌ల్కి సినిమాకి బుక్ చేస్తే అది ప్ర‌భాస్ 2898 ఏడికి వ‌ర్తిస్తుంద‌ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వివాదంపై రాజ‌శేఖ‌ర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

‘నాకు అస్సలు సంబంధం లేదు’ అంటూ రెండు వైవిధ్యమైన ఎమోజీలను పోస్ట్ చేసిన రాజ‌శేఖ‌ర్.. ఆ త‌ర్వాత జోక్స్ ప‌క్క‌న పెడితే.. ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్విని దత్‌గారు వైజయంతీ ఫిల్మ్స్, మరియు ఇందులో చేసిన అద్భుతమైన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియ‌జేశారు. టీమ్ ఈ సినిమాతో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించి టాలీవుడ్‌ని మ‌రో మెట్టు ఎక్కిస్తార‌ని ఆశిస్తున్నాను అంటూ రాజ‌శేఖర్ త‌న సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు.

Latest News