Kalki| క‌ల్కి నుండి న‌యా ట్రైల‌ర్ విడుద‌ల‌.. గూస్ బంప్స్ తెప్పిస్తుందిగా..!

Kalki| స‌లార్ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ క‌ల్కి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు, ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ కూడా హాట్

  • Publish Date - June 21, 2024 / 09:35 PM IST

Kalki| స‌లార్ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ క‌ల్కి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు, ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఏకంగా 2 మిలియన్స్ టికెట్స్ అడ్వాన్స్డ్‌ గా అమ్ముడవ్వమే హిస్టారికల్ గా మారిపోయింది. సుమారు 600 కోట్లకి పైగా బడ్జెట్ సినిమా కోసం వెచ్చించారు. దాదాపు ఇండియా లోని అగ్ర తారాగణం ఈ సినిమాలో ఉండడంతో మూవీకి లాభాలు రావ‌డం పక్కా అని మేక‌ర్స్ భావిస్తున్నారు.

ఇక మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా శుక్రవారం (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు రావాల్సిన ట్రైలర్.. రెండు గంటల 45 నిమిషాలు ఆలస్యంగా 8.45 గంటలకు రిలీజైంది. అయితే వెయిటింగ్‌ని మ‌రచిపోయేలా రెండో ట్రైల‌ర్ ఉంది. ఫైనల్ వార్ పేరుతో రిలీజైన ట్రైల‌ర్ ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరోసారి అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉండనున్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి.ప్రభాస్, అమితాబ్ మధ్య ఫైట్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. దీపిక కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడ‌ని అమితాబ్ చెప్ప‌గా, ఆ బిడ్డను చంపడానికి ప్రత్యర్థులు చూస్తుంటారు. దానిని అడ్డుకోవడానికి అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్ నిలుస్తాడు.

అయితే అతని అడ్డు తప్పించడానికి భైరవ పాత్రలోని ప్రభాస్ ఫైట్ చేస్తాడు. ఈ ఇద్దరి ఫైట్, కళ్లు చెదిరిపోయేలాంటి విజువల్స్, ట్రైలర్ చివర్లో అవతార్ మూవీలోలాగా ఓ పెద్ద రోబోనేసుకొని ఫైట్ కు రావడం హైలైట్స్ గా చెప్పొచ్చు. ఈ మూవీ ట్రైల‌ర్ అనేక అనుమానాలు రేకెత్తించ‌గా, మూవీ మాత్రం అంచ‌నాల‌కి మించి ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక కల్కి 2898 ఏడీ మూవీ 3 గంటల 56 సెకన్ల నిడివితో చాలా పెద్ద సినిమాగా రానుంది. ఈ మధ్యే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ మూవీ మూడు గంటల పాటు ఉండడం సినిమాకి మైన‌స్ అవుతుందా అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు వేర్వేరు ప్రపంచాల చుట్టూ క‌ల్కి మూవీ తిరుగుతుంద‌ని మేక‌ర్స్ చెప్పుకొచ్చారు.

Latest News