Site icon vidhaatha

Kalki| ప్ర‌భాస్ సినిమా టిక్కెట్ ధ‌ర తెలిసి ఉలిక్కి ప‌డుతున్న ఫ్యాన్స్.. ఇంత పెంచారేంటి..!

Kalki| చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్‌లో పెద్ద సినిమా విడుద‌లకి టైం ఫిక్స్ అయింది. గ‌త కొద్ది రోజులుగా థియేట‌ర్‌లో చిన్న సినిమ‌ల సంద‌డే ఉంది. ఇప్పుడు క‌ల్కి రూపంలో పెద్ద సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన క‌ల్కి చిత్రం జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో పాన్‌ వరల్డ్‌ తెరకెక్కిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కావటంతో మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిన కల్కి జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి ఇప్పుడు అంద‌రిలో ఉంది.

అయితే భారీ బ‌డ్జెట్ చిత్రాలు వ‌చ్చిన‌ప్పుడు సినిమా టిక్కెట్ ధ‌ర‌లు పెర‌గ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇప్పటికే కల్కి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రతిపాదనలు పంపగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతులిస్తూ పర్మిషన్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు అనుమతులు ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ రాష్ట్ర హోంశాఖను కోర‌గా.. ఐదు షోలు వేసేందుకు, టికెట్‌ ధర రూ.200 పెంచుకునేందుకు అనుమ‌తులు జారీ చేశారు. ఇక టిక్కెట్ రేట్ల‌ని రూ.75, రూ.100 టిక్కెట్ల ధరలనూ పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది.

అయితే పెరిగిన టిక్కెట్ రేట్ల‌ని బ‌ట్టి చూస్తే.. బెనిఫిట్ షోల రేట్లు.. సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల‌లో రూ.377 గా.. మల్టీప్లెక్స్‌ల‌లో రూ.495 గా ఉండ‌బోతుంది. ఇక‌ రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల‌లో రూ.265 ఉండ‌గా.. మల్టీప్లెక్స్‌ల‌లో రూ. 413 గా నిర్ణ‌యించారు. అయితే టికెట్ల పెంపు వ‌లన సినిమాపై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. అంతంత రేట్లు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడు, ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి ఎలా వ‌స్తారు అంటూ కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు.

Exit mobile version