Site icon vidhaatha

Kalki2898AD| ముంబై పోలీసుల‌కి చిక్కిన బుజ్జిని వాళ్లు ఏం చేశారంటే..!

Kalki2898AD| ఇటీవ‌ల బుజ్జి పేరు మనం ఎక్కువ‌గా వింటున్నాం. అందుకు కార‌ణం ప్ర‌భాస్ క‌ల్కి మూవీ. చిత్రంలో ప్ర‌భాస్ భైర‌వ అనే పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న వాడే వాహ‌న‌మే బుజ్జి. రోబోటిక్ కార్ బుజ్జిని ప‌రిచ‌యం చేసేందుకు మేక‌ర్స్ స్పెష‌ల్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయడం మ‌నం చూశాం. దీని కోసం దాదాపు ఏడు కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తుంది. మూవీ ప్రమోష‌న్స్‌లో భాగంగా బుజ్జిని ప‌లు ప్రాంతాల‌లో తిప్పుతూ అంద‌రి దృష్టి సినిమాపై ఉండేలా చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా జూన్ 27న భారీ అంచనాల మధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.ఈ క్ర‌మంలోనే ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో హల్చల్ చేసిన ఈ కార్ ఇప్పుడు ముంబైలోని.. జూహూ బీచ్ లో కూడా సంద‌డి చేసింది. ఈ క్ర‌మంలో బుజ్జి కార్ ఎక్కి.. ముంబై పోలీస్ ఆఫీసర్ ఒకరు ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుండ‌గా, ముంబై పోలీసుల చేతికి చిక్కిన బుజ్జి అంటూ ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. బుజ్జి హంగామా చూస్తుంటే ఇది సినిమాకి ఓ రేంజ్ ప్ర‌మోష‌న్స్ తెచ్చిపెడ‌తుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న భైరవ పాత్రను, రోబోటిక్ కార్ బుజ్జి పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ. ఒక చిన్న వెబ్ సిరీస్ ని ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక నాగ్ అశ్విన్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న క‌ల్కి చిత్రంలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. కమల్ హాసన్, దిశా పటాని, బ్రహ్మానందం కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు. మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచ‌బోతున్నారు. ప‌లు న‌గ‌రాల‌లో ఈ మూవీని భారీ ఎత్తున జ‌రిపేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా స‌మాచారం.

Exit mobile version