Site icon vidhaatha

కేరళ క్వీన్ గా కీర్తి సురేష్‌

విధాత:మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘మరక్కర్‌’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులను అందుకొన్నది. ఈ సినిమాలో కీర్తిసురేష్‌ కీలక పాత్రలో నటిస్తోంది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి యువరాణిగా పట్టాభిషిక్తురాలయ్యే యువతిగా విభిన్నంగా కీర్తిసురేష్‌ పాత్ర సాగుతుందని సమాచారం. ఇటీవలే ఒంటినిండా ఆభరణాలతో రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో కూడిన తన స్టిల్‌ను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నది కీర్తిసురేష్‌. తన కెరీర్‌లో మరోమైలురాయిగా నిలిచే పాత్ర ఇదని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version