Keerthy Suresh| నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతుంది. మహానటి సినిమాతో కీర్తి సురేష్‌కి నేషనల్ అవార్డ్ కూడా దక్కడం మనం చూశాం. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా సక్సెస్‌లు లేవు. అయినప్పటికీ కెరీర్‌ని అలా లాగేస్తుంది.
కెరీర్ మొదట్లో చాలా పద్దతిగా కనిపించిన కీర్తి సురేష్ మెల్లమెల్లగా గేట్లు ఎత్తేస్తుంది. ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే కీర్తి సురేష్ ఇంతవరకు లిప్ లాక్ సీన్లు, ఇంటిమేట్ సన్నివేశాలు వంటివి చేయలేదు. కాని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కోసం తొలిసారి లిప్ లాక్ సీన్‌లో నటించేందుకు సిద్ధమైందట. బేబీ జాన్ మూవీ కథలో భాగంగా ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు, రొమాన్స్ తప్పనిసరి అని డైరెక్టర్ చెప్పగా, దానికి కీర్తి సురేష్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. అయితే ఈ వార్త విని అందరు షాక్ అవుతున్నారు. బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత అక్కడి నీళ్లు కీర్తికి బాగా వంట పట్టినట్టు ఉన్నాయి అందుకే వేటికి కూడా నో అనడం లేదని కొందరు అంటున్నారు
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీ హర్రర్ & కామెడీ జోనర్ సినిమా కోసం కీర్తి సురేష్‌ని కథానాయికగా ఎంపిక చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా ఓకే అయితే అమ్మడు అక్కడ పాతుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్‌కి ప్రస్తుతం 17.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి ఒకరు కాగా, ఆమె కోలీవుడ్ మూవీ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక దంపతుల చిన్న కుమార్తె. బాల నటిగా ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.