Kingdom Box Office Collection Day 1 | తొలి రోజు కింగ్ డమ్ కలెక్షన్ల జోరు

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్‌డమ్ సినిమా తొలి రోజే వరల్డ్ వైడ్‌గా ₹39 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

kingdom-movie-first-day-box-office-collections-vijay-deverakonda-delivers-blockbuster

Kingdom Box Office Collection Day 1 |  విధాత : హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Devarakonda) న‌టించిన కింగ్‌డ‌మ్(Kingdom) చిత్రం గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిక్స్ డ్ టాక్ తో సాగుతుంది. జెర్సీ వంటి ఎమోష‌న‌ల్ డ్రామా త‌ర్వాత గౌత‌మ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) స్పై యాక్ష‌న్ జానర్‌లో రూపొందించిన కింగ్ డమ్ విజ‌య్ దేవ‌రకొండ అభిమానులకు మాత్రం కిక్ ఇస్తుంది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.39 కోట్ల వ‌సూళ్ల‌ను రాబట్టిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. దీనికి విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘మనం కొట్టినం’ అని క్యాప్షన్‌ పెట్టారు. వారాంతంలో కాకుండా మధ్యలో విడుదల చేసినప్పటికీ మొదటిరోజు ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం అరుదని చిత్ర బృందం పేర్కొంది. ‘ఈ రాజు తన రాకతో బీభత్సం సృష్టించాడంటూ’ పోస్టర్‌ పంచుకుంది.

గ్లామర్ తార భాగ్య‌శ్రీ భోర్సే(Bhagyashri Borse) హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనతో పాటు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. స‌త్య‌దేవ్, మలయాళ నటుడు వెంకటేశ్ ల యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయ‌ని కామెంట్లు పెడుతున్నారు.