Krithi Shetty | కాలం ఎవరికి ఎలా కలిసి వస్తుందో చెప్పలేం. ఏ విషయంలోనైనా సమయం కీలకం. అందివచ్చిన అవకాశాలకు అదృష్టం కూడా తోడైతే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఒకసారి చేజారిన అదృష్టం, అవకాశం మళ్లీ వరించడం కష్టమే. ఇక చేసేది ఏమీ ఉండదు. మళ్లీ సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూస్తూ.. తమవంతు ప్రయత్నాలు చేయాల్సిందే. ఇదంతా టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) కి సరిపోతుంది. ఉప్పెన మూవీ (Uppena Movie)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నది. దాంతో రూ.100కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ తర్వాత అవకాశాలు క్యూకట్టాయి. ఇందులో పలు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఆ తర్వాత పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. తెలుగులో అవకాశాలు తగ్గినా కోలీవుడ్‌లో తన అవకాశాలను దక్కించుకుంటూ సినిమాలు చేస్తున్నది. పలు తెలుగు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా.. కొద్దిరోజులు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీని లక్కీ ఛాన్స్ వరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నది. డైరెక్టర్ సుకుమార్, రామ్‌చరణ్ కాంబోలో ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇక రెండో హీరోయిన్‌గా కృతిశెట్టిని తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ మూవీలో రాంచరణ్‌కు బేబమ్మ లవర్‌గా కనిపించనుండగా.. జాన్వీ కపూర్ మరదలు పాత్రలో నటించనున్నట్లు టాక్ నడుస్తున్నది. ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో ట్రెండింగ్ మారింది. ఇదే నిజమైతే కృతిశెట్టికి మరోసారి బ్రేక్ వచ్చినట్టే. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ మూవీ తెరకెక్కనున్నది. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో సుకుమార్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ మూవీ విడుదలకానున్నది. వచ్చే జనవరిలో చెర్రీ, సుక్కు మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.