Site icon vidhaatha

Krithi Shetty | పార్టీకి వ‌స్తే ఎన్ని కోట్లైనా ఇస్తా.. కృతి శెట్టిని టార్చ‌ర్ పెడుతున్న హీరో త‌న‌యుడు

Krithi Shetty |

సినిమా ప‌రిశ్ర‌మలో క్యాస్టింగ్ కౌచ్ అనేది న‌టీమ‌ణుల‌ని మ‌హ‌మ్మారిలా పీడిస్తుంది ఎన్ని ఉద్య‌మాలు వ‌చ్చిన కూడా ఇవి ఆగ‌డం లేదు. ఆ మ‌ధ్య మీటూ లాంటి ఉద్య‌మం కాస్టింగ్ కౌచ్‌కి వ్య‌తిరేఖంగా ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. ఈ ఉద్య‌మం త‌ర్వాత‌నే చాలా మంది హీరోయిన్స్ తమ‌కి జ‌రిగిన అన్యాయాలని మీడియాకి ముందుకు వ‌చ్చి మ‌రి చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ ఎవ‌రిలో మార్పు రావ‌డం లేదు. అవ‌కాశాల కోసం హీరోయిన్స్‌ని హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు లేదంటే ఇత‌ర టెక్నీషియ‌న్స్ వేధించ‌డం కామ‌న్ అయిపోయింది. రీసెంట్‌గా ఉప్పెన చిత్రంతో ఓవ‌ర్‌నైట్ స్టార్ స్టేట‌స్ సాధించిన కృతిశెట్టి త‌న‌ని ఓ స్టార్ హీరో త‌న‌యుడు చాలా వేధించాడ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ హీరో త‌న‌యుడి కుమారుడు త‌న తో ఫ్రెండ్షిప్ చేయాలంటూ వేధిస్తున్నాడ‌ట‌. ఆమె ఏఈవెంట్‌కి వెళ్లిన కూడా అక్క‌డికి వెళ్లి ఇబ్బంది పెడుతున్నాడ‌ట‌.

అంతేకాదు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని త‌న బర్త్ డే పార్టీకి రావాల‌ని చెప్పాడ‌ని, అందుకోసం కోట్లు కూడా ఆఫ‌ర్ చేశాడ‌ని కృతి శెట్టి పేర్కొంది. మ‌రి కృతి శెట్టిని ఇంత‌లా ఇబ్బంది పెడుతున్న ఆ స్టార్ హీరో త‌న‌యుడు తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన వాడా, లేకుంటే త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన వాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

అస‌లే కృతి శెట్టికి ఈ మ‌ధ్య సరైన స‌క్సెస్‌లు లేవు. ఇలాంటి స‌మ‌యంలో కృతికి ఇలాంటి క‌ష్టాలు వ‌చ్చాయేంట‌ని న‌లుగురు ముచ్చ‌టించుకుంటున్నారు. ఉప్పెన త‌ర్వాత ఈ అమ్మ‌డు నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్’ , నాగ్ -చైతూ కాంబోలో వ‌చ్చిన ‘బంగార్రాజు’ చిత్రాలు చేసింది.

ఇవి రెండు ప‌ర్వాలేద‌నిపించాయి. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’ ఇలా వ‌రుస చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తీవ్ర నిరాశ‌ప‌రిచాయి. ఇప్పుడు ఈ అమ్మ‌డు ప‌లు త‌మిళ సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ 35వ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాల‌తో అయిన తాను క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌ని అనుకుంటుంది.

Exit mobile version