Bala Krishna:సైకోలా మారిన బాల‌కృష్ణ‌.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన స్టార్ డైరెక్ట‌ర్

Bala Krishna: నంద‌మూరి బాల‌కృష్ణ‌ది చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అని ఇండ‌స్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. ఆయ‌న కి కోపం వ‌స్తే తిడ‌తారు, ప్రేమ వ‌స్తే అక్కున చే

  • Publish Date - April 27, 2024 / 07:01 AM IST

Bala Krishna: నంద‌మూరి బాల‌కృష్ణ‌ది చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అని ఇండ‌స్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. ఆయ‌న కి కోపం వ‌స్తే తిడ‌తారు, ప్రేమ వ‌స్తే అక్కున చేర్చుకుంటారు. బాల‌య్య త‌న అభిమానుల మీద ప‌లు సంద‌ర్భాల‌లో చేయి చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఏనాడు వారు నెగిటివ్‌గా మాట్లాడింది లేదు. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం బాలకృష్ణను సైకో అనడం చర్చకు దారి తీసింది. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న ర‌జ‌నీకాంత్‌,క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్ హీరోల‌తో కూడా సినిమాలు చేసి మంచి హిట్స్ కొట్టాడు. ఇక నంద‌మూరి బాల‌య్య‌తో కూడా సినిమాలు చేశాడు.

అయితే ఓ ఘ‌ట‌న వ‌ల‌న ర‌వి కుమార్‌కి బాల‌య్య మీద మ‌న‌సు విరిగిపోయింద‌ని, అత‌ను సైకోలా మారాడని కామెంట్ చేశారు. సాగర సంగమం చిత్రం భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు మా అబ్బాయి బాలకృష్ణతో ఒక మూవీ చేయమని దర్శకుడు కే విశ్వనాథ్ ని కోరారట. అప్పుడు కే విశ్వ‌నాథ్.. జనని జన్మభూమి టైటిల్ తో బాలయ్య హీరోగా సినిమా చేశారు. ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడట.అయితే ఈ మూవీ షూటింగ్ ర‌వికుమార్ ఊరి ద‌గ్గ‌ర్లోనే జ‌రిగేద‌ట‌. ఇక వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు బాలయ్య అంద‌రితో చాలా స‌రదాగా ఉంటూ క‌లిసిపోయేవాడ‌ట‌. అయితే జననీ జన్మభూమి షూటింగ్ లో బాల‌య్య ఒక అభిమానిపై చేయి చేసుకున్నాడు..

బాలయ్య‌ని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన కొంద‌రు అభిమానుల‌లో ఓ అభిమాని బాలయ్య భుజం మీద చేయి వేశాడు. దాంతో ఆ అభిమానిని బాల‌య్య చాలా దారుణంగా కొట్టాడు. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత ఆయ‌నపై నాకు మ‌న‌సు విరిగింది. నిజంగా ఆయ‌న ఒక సైకో. ఆ వ్య‌క్తి తిరిగి నిన్ను కొడితే ఎలా ఉండేది. ప‌రువు ద‌క్కేదా. నిజంగా సంస్కారం లేని వాడు బాల‌య్య అంటూ కేఎస్ ర‌వి కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. గ‌తంలో కూడా కేఎస్ ర‌వికుమార్ బాల‌య్య గురించి మాట్లాడుతూ..అసిస్టెంట్ న‌వ్వాడ‌ని కొట్ట‌బోయాడు. అప్పుడు నేను అడ్డుప‌డ్డాను అని ర‌వి కుమార్ అన్నారు. మరి ఈ ద‌ర్శ‌కుడి కామెంట్స్‌పై బాల‌య్య ఏమైన స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

Latest News