విధాత :దర్శకధీరుడు రాజమౌళి దర్శకుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’. భారీ అంచనాలతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను యూనిట్ తెలియజేసింది.
రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యిందని, అంతే కాకుండా ఎన్టీఆర్, రామ్‌చరణ్ రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారని ప్రకటించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ని దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.