Site icon vidhaatha

Lavanya| రాజ్ త‌రుణ్ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పోలిక పెట్టిన లావ‌ణ్య‌.. అలా అనేసింది ఏంటి?

Lavanya| గ‌త కొద్ది రోజులుగా ఇండ‌స్ట్రీలో రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య గురించి హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. రాజ్ త‌రుణ్ త‌న‌ని మోసం చేశాడ‌ని, రెండు సార్లు అబార్ష‌న్ కూడా చేయించాడ‌ని, త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఫైట్ చేస్తాన‌ని చెప్పుకొచ్చింది లావ‌ణ్య‌. అయితే ఈ వివాదం గురించి లావ‌ణ్య నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా, ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది. 493 సెక్ష‌న్ ప్ర‌కారం రాజ్ త‌రుణ్‌కి ప‌దేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ తనకి కావాలని, ఆయ‌న ద‌క్కే వ‌ర‌కు వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తి లేద‌ని అంటుంది. ఈ విష‌యం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలుస్తానని లావణ్య పేర్కొంది. పవన్ కళ్యాణ్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పిన లావ‌ణ్య‌.. ఆయ‌న భార్య‌ల గురించి కూడా మాట్లాడింది. నాకు తెలిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన భార్యల విషయంలో ఎవరిని మోసం చేయలేదని , రాజ్ తరుణ్ తనకి చేసిన అన్యాయాన్ని పవన్ దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పుకొచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మాజీ భార్య‌ల‌ని బాగా చూసుకున్నార‌ని, ఆ బాధ్య‌త రాజ్ త‌రుణ్‌కి లేద‌ని లావ‌ణ్య పేర్కొంది. క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌కుండా న‌న్ను వ‌దిలేశాడు అని లావ‌ణ్య పేర్కొంది.

కచ్చితంగా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని లావణ్య ఇంటర్వ్యూలో తెలిపింది. రాజ్ తరుణ్ తనని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, మోసం చేసాడని పవన్ కళ్యాణ్ కి విన్నవించుకుంటానని లావణ్య తెలియ‌జేసింది. దేవుళ్ల‌లో శివుడు అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, మ‌నుషుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఇష్ట‌మ‌ని పేర్కొంది.ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తార‌ని నేను న‌మ్ముతున్నాను అంటూ లావ‌ణ్య స్ప‌ష్టం చేసింది. ఇక మరో వైపు లావణ్య తరపున కళ్యాణ్ దిలీప్ సుంకర కేసుని టేకప్ చేసి లీగల్ గా ఫైట్ చేస్తున్న విష‌యం తెలిసిందే

Exit mobile version