రూ.300కోట్ల క్లబ్ లో ‘లోక చాప్టర్ 1’

'లోక చాప్టర్ 1' చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులను సృష్టిస్తూ రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. రూ.300 కోట్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.

Lokah Chapter 1

విధాత: ‘లోక చాప్టర్ 1’ మలయాళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 29న రిలీజై..ప్రపంచవ్యాప్తంగా రూ. 300కోట్ల వసూళ్ల దిశగా దూసుకపోతుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మొదటి రూ.300 కోట్ల వసూళ్ల సినిమా రికార్డు సాధించబోతుంది. కేరళలో 39రోజులలో రూ.119 కోట్ల కలెక్షన్ సాధించిన మళయాళ సినిమాగా తుడురమ్ (118కోట్లు) రికార్డును కూడా అధిగమించింది. దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫరర్ ఫిలిమ్స్ నిర్మించిన ఏడవ చిత్రం ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ (కొత్త లోక) మలయాళ సినిమా ఇండ‌స్ట్రీకి మరో మైలురాయిగా నిలిచింది. ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ మూవీకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్ , నెస్లన్, చందు, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కేరళలో ప్రసిద్ధి చెందిన కల్లింగట్టు నీలి కథ నుండి ప్రేరణతో ఈ మూవీని సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి భాగంగా తెరకెక్కించారు. మొత్తం ఐదు భాగాల సిరీస్‌లో ఇదే మొదటి చిత్రం. దుల్కర్, టొవినో అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విజయం పరంపరలో భాగంగా మేకర్స్ ఇప్పటికే ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్. లోకా చాప్టర్ 2 లో మలయాళ యంగ్ స్టార్ టోవినో థామస్ హీరోగా నటించనున్నారు. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.