Ram Charan| తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకోవడం అందరికి సాధ్యం కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఉన్నత శిఖరాలని అధిరోహించాడు.ఆయన తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా నుండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శ్రమించిన రామ్ చరణ్ తనదైన నటన, డ్యాన్సులు, యాక్షన్ మూమెంట్స్ మెగా పవర్ స్టార్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు.. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
మగధీర చిత్రంతో తనలోని అసలు టాలెంట్ పరిచయం చేశాడు. రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాలలో చెర్రీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. అతని పర్‌ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తన నటనతో అదరహో అనిపించడమే కాకుండా హాలీవుడ్ ప్రముఖులతో కూడా ప్రశంసలు అందుకున్నాడు.అయితే రామ్ చరణ్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ విగ్రహా ఆవిష్కరణ ఉండబోతుందని తెలియజేశారు.
అయితే రామ్ చరణ్‌తోపాటు ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ప్రస్తుతం చెర్రీ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.రామ్ చరణ్ కూడా తనకి ఇలాంటి అరుదైన అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.