Madhavi| అలనాటి అందాల నటి మాధవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో వందకి పైగా చిత్రాలలో నటించింది మాధవి. అప్పట్లో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత అవకాశాలు రాకనో, ఇంకేమైన కారణమో తెలియదు కాని పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతుంది. చిరంజీవితో ఖైదీ సినిమాలో ఆడిపాడిన హీరోయిన్ మాధవి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు పుట్టారు. హైదరాబాద్‌లో ఆమె పెరిగారు. మాధవి అసలు పేరు కనక మహాలక్ష్మీ.. చిన్నప్పటినుంచే భరతనాట్యం పట్ల ఆసక్తి ఉండడంతో పేరెంట్స్ ఆమెరి శిక్షణ ఇప్పించారు.
దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన మాధవి ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు దాసరి నారాయణరావు ఆమెని చూసి, డాన్స్‌కు ఇప్రెస్ అయ్యారు అందులో భాగంగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘తూర్పు పడమర’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. అలా మాధవి 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన ‘మాధవి’ అని మార్చారు. ఇక ఆ తర్వాత ఆమెకి పలు సినిమాలలో అవకాశం దక్కడం, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగడం కూడా జరిగింది.
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ , ‘కోతల రాయుడు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘ఖైదీ’, మొదలగు హిట్ సినిమాల్లో నటించి అదరగొట్టారు. మాధవి ‘మాతృదేవోభవ’ సినిమాలో తన నటనతో కన్నీళ్లు తెప్పించారు. మాధవి నటించిన చివరి తెలుగు చిత్రం బిగ్ బాస్. ఇక ఆమె నటించిన ఇతర తెలుగు చిత్రాల్లో మరో చరిత్ర, మంచి మనసు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్లులేవు, చట్టంతో పోరాటం వంటివి ముఖ్యమైనవి. తాజాగా తన ముగ్గురు కూతుళ్లతో కలిసి స్పెయిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 1996లో రాల్ఫ్ శర్మను పెళ్లి చేసుకుంది మాధవి. ఆమె కూతుళ్ళ పేర్లు టిఫానీ గౌరికా, ప్రిస్కిల్లా అర్బానా, ఎవెలిన్ దివ్య .