SSMB 29 : మహేశ్ బాబు సినిమా అప్డేట్ ఈవెంట్ కు రాజమౌళి భారీ సెట్

మహేశ్ బాబు–రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 అప్డేట్ ఈవెంట్‌ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి భారీ సెట్‌ నిర్మిస్తున్నారు.

SSMB 29

విధాత : మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజామౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29(SSMB29) సినిమా ఫస్ట్ అప్డేట్ పబ్లిక్ ఈవెంట్ నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్ కోసం ఏకంగా రాజమౌళి భారీ సెట్ నిర్మింపచేస్తుండటం ఆసక్తికరం. రామోజీ ఫిల్మ్ సిటీలో.. 100 అడుగుల ఎత్తుతో భారీ ఎల్ఈడీ టవర్ సెట్ ఏర్పాటు చేయిస్తున్నారు.

ఇదే ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్ ప్రకటన చేయబోతున్నారు. అలాగే ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేస్తారని సమాచారం. ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్‌, ఇతర నటీనటులు హాజరుకాబోతున్నారు.

ఎస్ ఎస్ ఎంబీ 29 పేరుతో రాజామౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మూవీ ఇప్పటికే నాలుగో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్‌ కోసం ప్లాన్‌ చేస్తోంది. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారని..ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంఛర్ మూవీగా ఈ సినిమా రాబోతుందని సమాచారం.