ఓటీటీ వల్ల ఎన్నో లాభాలు : ప్రముఖ సినీ దర్శకులు రామ్ భీమన

విధాత:ఓటీటీ మాధ్యమానికి సపరేట్ ప్రేక్షకులు ఉన్నారని, అలా అని థియేటర్లు మూతపడే పరిస్థితి ఎప్పటికీ రాదని సినీ దర్శకులు రామ్ భీమన అన్నారు. ఫిలిం అండ్ టెలివిజిన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన ' ఓటీటీ ప్రభావం ప్రేక్షకులపై ఎలా ఉంది' అనే అంశంపై ఏర్పాటు చేసిన స్పెషల్ వర్క్ షాప్ లో రామ్ భీమన పాల్గొన్నారు.థియేటర్లో సినిమా చూసే అనుభూతే వేరు అని, కానీ ఓటీటీ వల్ల సౌకర్యవంతంగా సినిమా చూసే వెసులుబాటు ఉందని, […]

  • Publish Date - July 7, 2021 / 12:41 PM IST

విధాత:ఓటీటీ మాధ్యమానికి సపరేట్ ప్రేక్షకులు ఉన్నారని, అలా అని థియేటర్లు మూతపడే పరిస్థితి ఎప్పటికీ రాదని సినీ దర్శకులు రామ్ భీమన అన్నారు. ఫిలిం అండ్ టెలివిజిన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన ‘ ఓటీటీ ప్రభావం ప్రేక్షకులపై ఎలా ఉంది’ అనే అంశంపై ఏర్పాటు చేసిన స్పెషల్ వర్క్ షాప్ లో రామ్ భీమన పాల్గొన్నారు.థియేటర్లో సినిమా చూసే అనుభూతే వేరు అని, కానీ ఓటీటీ వల్ల సౌకర్యవంతంగా సినిమా చూసే వెసులుబాటు ఉందని, ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలంటే అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఓటీటీ చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తో పాటు, మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా తెలియాల్సిన అవసరం దర్శకుడికి ఉందని, అప్పుడే నిర్మాత సినిమా తీయడానికి ముందుకొస్తారని రామ్ తెలియజేశారు.

ఓటీటీ లకు సినిమా అమ్మాలా ? థియేటర్లోనే రిలీజ్ చేయాలా? అనేది నిర్మాత,దర్శకులు బాగా ఆలోచించి,నిర్ణయం తీసుకో వలసి ఉంటుందని ఆయన తెలిపారు ఓటీటీ వల్ల డబ్బు ఎలా వస్తుంది ? ఓటీటీ వాళ్ళు సినిమా తీసుకోవాలంటే ఎలాంటి ఆంక్షలు పెడతారు ? ప్రస్తుతం ప్రాంతీయ,జాతీయ,అంతర్జాతీయ ఓటీటీలు ఎన్ని ఉన్నాయి ? ఇలాంటి ఎన్నో విషయాలను ఆయన ఈ వర్క్ షాప్ లో వివరించారు. ఫిల్మ్ మేకింగ్ మరియు మార్కెటింగ్ గురించి విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. జూమ్ సెషన్ ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమం లో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. యఫ్.టీ.ఐ.హెచ్. ఫిల్మ్ మేకింగ్ విద్యార్థులు, మరియు సినిమా తీయాలనే ఆసక్తి ఉన్నవారు తమకు ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆకతాయి, హమ్ తుమ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఇప్పుడు రూపొందిస్తున్న ‘ జగదానంద కారకా’ చిత్రం విజయ వంతం కావాలని యఫ్.టీ.ఐ.హెచ్ విద్యార్థులు రామ్ భీమనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యఫ్. టీ. ఐ.హెచ్. సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, ఫిల్మ్ మేకింగ్ ఫ్యాకల్టీ & ప్లేస్ మెంట్ సెల్ ఇంచార్జ్ , ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Latest News