Meenakshi Chaudhary|ఆ అక్కినేని హీరోతో మీనాక్షి చౌదరి వివాహం.. హాట్ టాపిక్‌గా మారిన మేట‌ర్

Meenakshi Chaudhary|మీనాక్షి చౌద‌రి.. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తుంది. ప‌లువురు స్టార్ హీరోల సినిమాల‌లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం.. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామకు ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తు

Meenakshi Chaudhary|మీనాక్షి చౌద‌రి.. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తుంది. ప‌లువురు స్టార్ హీరోల సినిమాల‌లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం.. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామకు ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్ప‌టి వ‌రకు తెలుగులో రవితేజ సరసన ఖిలాడి, విశ్వక్ సేన్ తో హిట్, మహేష్ బాబుకు మరదలిగా గుంటూరు కారంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో విజయ్ సరసన గోట్ అనే సినిమాలో కూడా నటించింది. రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్ సరసన లక్కీభాస్కర్ లో నటించి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం మీనాక్షి.. హీరో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ నేప‌థ్యంలో మీనాక్షి గురించి సోష‌ల్ మీడియాలో కొన్ని వార్త‌లు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మీనాక్షి చౌదరి త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతోందంటూ ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, మీనాక్షి చౌదరి డేటింగ్‌లో ఉన్నార‌ని వీరిద్ద‌రు త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్నార‌ని టాలీవుడ్ స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కాని ఈ వార్త ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

సుశాంత్ విష‌యానికి వ‌స్తే.. అడ్డా, లవ్లీ, కరెంట్, కాళిదాసు లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. అల వైకుంఠపురంలో చేసిన పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. ఇక మీనాక్షి చౌద‌రి విష‌యానికి వ‌స్తే..మోడల్ నుంచి నటిగా మారిన ఈ బ్యూటీ 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొట్టింది. చదువుకున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 గా కిరీటాన్ని పొందింది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను ఖుషి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.