విధాత:నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపు నిచ్చారు. కాగా,చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా గత కొన్ని దశాబ్దాలు గా చిరంజీవి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ,ఆపదలో వున్న వారికి రక్తాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వేళ ఆక్సిజన్ ను కూడా అందిస్తూ ఆయన సేవా కార్య క్రమాలను కొనసాగిస్తున్నారు.