Site icon vidhaatha

తెలుగు ఇండ‌స్ట్రీలో నలుగురు, ఐదుగురు మాత్రమే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు

విధాత‌: లవ్‌స్టోరీ ప్రీరిలీజ్ ఫక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని నలుగురు, ఐదుగురు మాత్రమే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్నారు. నలుగురైదుగురి గురించి అందరినీ ఇబ్బంది పెట్టొద్దు,అందరు హీరోలు, డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారని అనుకోవద్దు. ఇండస్ట్రీ సాధక బాధకాలను సీఎంలు పట్టించుకోవాలి. ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు పరిష్కరించాలని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఆదుకోవడంలో చిత్ర పరిశ్రమ ముందుంటుందని చిరంజీవి తెలిపారు.కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందన్నారు. పరిశ్రమ ఇబ్బందులను గుర్తించి తగిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version