Bigg Boss8| ప్రతి సంవత్సరం దీపావళి, దసరా పండుగలకి బిగ్ బాస్ షోని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారు. సెలబ్రిటీలని పిలిచి వారితో వినోదం పంచే ప్రయత్నం చేస్తారు. దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ షో ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దీపావళి సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆద్యంతం ఈ షో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అనసూయ, మెహరీన్ డాన్సులతో, ఓ సింగర్ పాటలతో అలరించారు. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమా యూనిట్లు వచ్చి తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటూనే హౌజ్‌మేట్స్‌తో సందడి చేశాయి. `క` సినిమా టీమ్ కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్‌లు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. అలానే `లక్కీ భాస్కర్` టీమ్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొన్నారు.
మరోవైపు `అమరన్` టీమ్ సాయి పల్లవి, శివ కార్తికేయన్, చిత్ర దర్శకుడు పాల్గొని తమ సినిమా విశేషాలను వెల్లడించారు.ఇక ఎప్పటి మాదిరిగానే హైపర్ ఆది పంచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన ఒక్కో కంటెస్టెంట్ గురించి వాళ్ల బలాలు, బలహీనతలు తెలిపారు. లవ్ స్టోరీలు, బ్రేకప్‌లు, కవ్వింపులు, పులిహోర వ్యవహారాలు, డ్రామాలను అన్నింటిని చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు హైపర్ ఆది.అయిత చాలా సందడిగా సాగిన తర్వాత ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. అంతా అనుకున్నట్టే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. నయని పావని, మెహబూబ్‌లు చివరగా నిలవగా, వీరిలో మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు నాగ్ తెలియజేశారు.
మూడు వారాలు మాత్రమే హౌజ్‌లో ఉన్న మెహబూబ్ జర్నీ పెద్దగా సాగలేదు. టాస్క్ ల్లో ఉన్నట్టుగా కంటెంట్ ఇవ్వడంలో మెహబూబ్ వెనకబడిపోతున్నాడని, ఆటలు బాగా ఆడుతున్నాడు, కానీ ఇంటి సభ్యులతో కలివిడిగా ఉండటం లేదని, ఎంటర్‌టైన్ చేయలేకపోతుననకనాడనే ఆరోపణలు ఉండగా, అతను బిగ్ బాస్ హౌజ్ తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్రోమోను చూపించారు. ఈ ప్రోమోలో కడుపు నొప్పేస్తుంది, వెళ్లిపోతానని అవినాష్ చెబుతూ కనిపించాడు. ఆవినాష్ కడుపునొప్పితో బాధపడుతున్నట్టు కనిపిస్తుండగా, అతను ట్రీట్‌మెంట్ కోసం బయటకి వచ్చినట్టు చెప్పారు. మరి ట్రీట్‌మెంట్ పూర్తయిన తర్వాత తిరిగి హౌజ్‌లో అడుగుపెట్టాడా? లేదంటే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడా అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.