Mehreen| దానికోసం క‌డుపు తెచ్చుకోన‌క్క‌ర్లేదు.. సంచ‌ల‌నం రేపుతున్న మెహ్రీన్ పోస్ట్

Mehreen| పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై ర‌చ్చ లేపుతున్న అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. ఈ భామ కెరీర్ మొద‌ట్లో మంచి మంచి సినిమాలు చేస్తూ పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న అందచందాల‌తో కుర్రాళ్లకి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించింది. వ‌రుస సినిమా అవ‌కాశాలు కూడా అందుకుంది. అయితే ఇటీవ‌ల మాత్రం అంత‌గా అందిపుచ్చుకోలేక‌పో

  • Publish Date - May 15, 2024 / 09:11 AM IST

Mehreen| పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై ర‌చ్చ లేపుతున్న అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. ఈ భామ కెరీర్ మొద‌ట్లో మంచి మంచి సినిమాలు చేస్తూ పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న అందచందాల‌తో కుర్రాళ్లకి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించింది. వ‌రుస సినిమా అవ‌కాశాలు కూడా అందుకుంది. అయితే ఇటీవ‌ల మాత్రం అంత‌గా అందిపుచ్చుకోలేక‌పోతుంది. దీంతో సోష‌ల్ మీడియాని వేడెక్కిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది.అయితే ఇటీవ‌ల చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా ఆ జాబితాలో మెహ్రీన్ కూడా చేరింది.

ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. రెండేళ్లుగా ఈ ప్ర‌క్రియ‌కి వెళ్ల‌డానికి నా మ‌న‌సుని సిద్ధం చేసుకున్నా. చివ‌రికి పూర్తి చేసినందుకు ఆనందంగా ఉంద‌ని తెలియ‌జేసింది. అయితే ఈ విష‌యాన్ని చెప్పాలా వద్దా? అని సందిగ్ధానికి గురయ్యానని మెహ్రీన్ తెలియజేశారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, వాళ్లలో అవగాహన పెంచాలని ఎగ్ ఫ్రీజింగ్ చేసిన విష‌యాన్ని తెలియ‌జేసిన‌ట్టు మెహ్రీన్ పేర్కొంది. అయితే ఆమె ఈ విష‌యం తెలియ‌జేసిన త‌ర్వాత మెహ్రీన్ గర్భం దాల్చారని, ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయ్యారంటూ అనేక క‌థ‌నాలు దావానంలా వ్యాపించాయి.

అయితే ఈ వార్త‌ల‌పై మెహ్రీన్ చాలా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన ప‌ని లేదు.. మీ స్వార్థం కోసం తప్పుడు కథనాలు రాస్తున్నారు. జ‌ర్న‌లిస్నుల‌కి క‌నీస బాధ్య‌త ఉండాలి క‌దా. పిల్లలు వెంట‌నే వ‌ద్ద‌నుకునే త‌ల్లిదండ్రులు అంతా సిద్ధం అయ్యాక పిల్ల‌ల్ని క‌నేందుకు ఎగ్ ఫ్రీజింగ్ ప‌ద్ద‌తిని ఉప‌యోగిస్తారు. అయితే ఈ ప‌ద్ధ‌తి గురించి స‌రిగా తెలియ‌ని వారే ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్టు తప్పుడు వార్త‌లు రాస్తారు. ఇక‌నైన అలాంటి త‌ప్పుడు వార్త‌లు రాయ‌డం ఆప‌క‌పోతే మాత్రం చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌ల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. కాగా మెహ్రీన్ 2021లో భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని ఆ త‌ర్వాత ఎవరు ఊహించ‌ని విధంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

 

Latest News