Site icon vidhaatha

Mothers Day| మ‌దర్స్ డే స్పెష‌ల్.. ఈ సెల‌బ్రిటీల పిల్ల‌ల‌కి ఇదే తొలి మ‌దర్స్ డే..!

Mothers Day| అమ్మ అనే మాట రెండు అక్ష‌రాలే. కాని ఆ మాట ఎంతో మ‌ధురం. ప్ర‌తి ప్రాణికి కూడా వ‌రం అమ్మ‌. అమ్మ లేక‌పోతే సృష్టే లేదు. లోకాన్ని న‌డిపించే అద్వితీయ శ‌క్తి అమ్మ‌లో ఉంటుంది. స్వార్ధం లేని ప్రేమ అమ్మ‌ది. ఏ నాడు గొప్ప‌ల‌కి పోకుండా త‌న బిడ్డ‌ల బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉండే అమ్మ‌ల‌కి ఈ రోజు స్పెష‌ల్ డే. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రు కూడా వారి తల్లుల‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అయితే కొంద‌రు సెల‌బ్రిటీల పిల్ల‌ల‌కి ఇది మొద‌టి మ‌ద‌ర్స్ డే కాగా, వారెవ‌రో ఇప్పుడు చూద్దాం. ముందుగా చూస్తే రామ్ చ‌రణ్‌, ఉపాస‌నల గారాల ప‌ట్టికి ఇది తొలి మ‌దర్స్ డే. గతేడాది 20న జ‌న్మించిన క్లింకార పుట్టిన‌ప్ప‌టి నుండే సెల‌బ్రిటీగా మారింది.

ఇక విరాట్ కోహ్లీ, అనుష్క జంట త‌మ రెండో సంతానంగా ఫిబ్ర‌వరి 15న కుమారుడికి జ‌న్మ‌నిచ్చారు. ఆ కుర్రాడికి అకాయ్ అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. అయితే ఈ జంట‌కి తొలి సంతానంగా వామిక జ‌న్మించ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు పాప ఫేస్ కూడా రివీల్ చేయ‌లేదు. ఇక బాబు ఫేస్ కూడా క‌న‌ప‌డ‌కుండా చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. టాలీవుడ్ సెల‌బ్రిటీ జంట మంచు మ‌నోజ్, భూమా మౌనిక కొద్ది రోజుల క్రితం త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ అందుకున్నారు. ఏప్రిల్ 13న భూమ మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వ‌డంతో ఈ విష‌యాన్ని మంచు ల‌క్ష్మీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇక మనోజ్ కూడా ఆమె ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేశాడు.

ఇక టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా కొద్ది రోజుల క్రితం తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 3న రక్షితా రెడ్డి, శ‌ర్వానంద్‌ల వివాహం ఘ‌నంగా జ‌ర‌గ‌గా, వీరికి ఆడబిడ్డ జన్మించింది. ఇక ఈవిషయాన్ని తన పుట్టినరోజు సందర్భంగా శ‌ర్వానంద్ తెలియ‌జేస్తూ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇలా ఈ బుడ‌త‌ల‌కి తొలి మ‌ద‌ర్స్ డే కాగా, ఈ రోజు వారి త‌ల్లుల‌తో సంతోషంగా గ‌డ‌ప‌నున్నారు.

Exit mobile version