Mrunal Thakur| బిగ్ బీ మ‌న‌వ‌రాలి బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన మృణాల్‌..కుర్రాళ్ళ గుండెలు బద్దలు

Mrunal Thakur|  హ‌నురాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌కి చాలా ద‌గ్గ‌రైంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కుర్రాళ్ల‌ని క‌ట్టి ప‌డేస్తుంది.బాలీవుడ్ లోను ఈ భామ‌కి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అయితే మృణాల్‌ ఠాకూర్‌.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో న‌టిగా మారింది. ఆ త‌ర్వాత 'విట్టి దండు' అనే మరాఠీ మూవీతో హీరోయిన్‌గా

  • Publish Date - May 17, 2024 / 06:39 AM IST

Mrunal Thakur|  హ‌నురాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌కి చాలా ద‌గ్గ‌రైంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కుర్రాళ్ల‌ని క‌ట్టి ప‌డేస్తుంది.బాలీవుడ్ లోను ఈ భామ‌కి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అయితే మృణాల్‌ ఠాకూర్‌.. ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే సీరియల్‌తో న‌టిగా మారింది. ఆ త‌ర్వాత ‘విట్టి దండు’ అనే మరాఠీ మూవీతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ మంచి పేరు సంపాదించుకుంది. ఆ క్ర‌మంలోనే ‘సీతా రామం’తో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావ‌డంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది.

ఇక మృణాల్ ఠాకూర్ నానితో క‌లిసి ‘హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమా భారీ హిట్‌ను అందుకుంది. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ చేసింది. ఈ సినిమా ఆమెకు పరాజయాన్నే మిగిల్చింది. మృణాల్‌కి చాలానే ఆఫ‌ర్స్ వ‌స్తున్నా ఈ అమ్మ‌డు మాత్రం ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటుంది. ప్ర‌స్తుతం హిందీలో ‘Pooja Meri Jaan’ అనే చిత్రం చేస్తుంది. ఇక త్వ‌ర‌లో ప్రభాస్ మొద‌లు పెట్ట‌నున్న ఓ సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, సిరీస్‌లకు మృణాల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని అంటున్నారు.

ఇక మృణాల్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఓ వ్యక్తితో ఈ అమ్మ‌డు డేటింగ్ చేస్తుందని , మృణాల్ బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ ఇప్పుడు నెట్టింట తెగ చ‌ర్చ న‌డుస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఇద్ద‌రు రెస్టారెంట్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా కెమెరాల‌కి చిక్కారు. దీంతో వారిద్ద‌రు డేటింగ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే మృణాల్‌- సిద్ధాంత్ క‌లిసి సినిమా చేయ‌డం వ‌ల్ల వారు రెస్టారెంట్‌కి వెళ్లారని, సిద్ధాంత్ ప్ర‌స్తుతం బిగ్ బీ మ‌న‌వ‌రాలు న‌వ్య న‌వేలితో ప్రేమ‌లో ఉన్నార‌ని మ‌రి కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Latest News