GV Prakash | 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగీత దర్శకుడు జీవీప్రకాశ్‌-సైంధవి జంట

GV Prakash | సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత కామనో.. డివోర్స్‌ సైతం అంతే సాధారణంగా మారింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు పెళ్లి చేసుకొని విడిపోయారు. ఆ జాబితాలో మరో జంట సైతం చేరింది. గత 11 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌, సింగర్‌ సైంధవి జంట విడిపోతున్నట్లుగా ప్రకటించింది.

  • Publish Date - May 14, 2024 / 09:56 AM IST

GV Prakash | సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత కామనో.. డివోర్స్‌ సైతం అంతే సాధారణంగా మారింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు పెళ్లి చేసుకొని విడిపోయారు. ఆ జాబితాలో మరో జంట సైతం చేరింది. గత 11 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌, సింగర్‌ సైంధవి జంట విడిపోతున్నట్లుగా ప్రకటించింది. జీవీ ప్రకాశ్‌, సైంధవి ఇద్దరు సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. గత కొద్దిరోజులుగా ఇద్దరూ విడిపోనున్నట్లుగా ప్రచారం కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. చివరకు వాస్తవమని తేలింది. తమ 11 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి సైంధవి జీవీ ప్రకాశ్‌కు చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరు దాదాపు 12 సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పాప సైతం ఉన్నది.


సోషల్‌ మీడియా పోస్ట్‌లో జీవీ ప్రకాశ్‌.. ‘చాలా ఆలోచించిన అనంతరం సైంధవి, నేను 11 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి తాము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’ అని జీవీ సోషల్‌ మీడియా పోస్ట్‌లో కోరారు. జీవీ ప్రకాశ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడు.


కోలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే, హీరోగానూ పలు చిత్రాల్లో అలరించాడు. తెలుగులోనూ పలు చిత్రాలకు సంగీతం అందించాడు. సైంధవి 12వ సంవత్సరాల వయసులో ఓ టీవీ షో సింగర్‌గా గుర్తింపు పొంది. విక్రమ్‌ అన్నియన్‌ (తెలుగులో అపరిచితుడు) చిత్రంతో సినీరంగంలోకి సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో పాటలు పాడింది. తెలుగులో తొలిసారిగా ఎంఎం కిరవాణి సంగీత దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’ సినిమాలో ‘రైలుబండి’ పాటను పడింది. ఈ తర్వాత నాగార్జున డాన్‌ సినిమాలో ‘ముద్దే పెట్టు ముద్దేపెట్టు’ సాంగ్‌ను ఆలపించింది. పరుగు, కాస్కో, శశిరేఖా పరిణయం, శక్తితో పాటు పలు సినిమాల్లోనూ పాటలు పాడింది.

Latest News