Site icon vidhaatha

Naga Babu| ఆ ట్వీట్ డిలీట్ చేసిన నాగబాబు.. మెగా- అల్లు వివాదానికి చెక్ ప‌డ్డ‌ట్టేనా?

Naga Babu| మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య లోలోప‌ల గొడ‌వ‌లు ఉన్న‌ట్టు కొన్నాళ్ల నుండి ప్ర‌చారం న‌డుస్తుంది. అయితే ఏపీ ఎన్నిక‌ల‌లో అవి క్లియ‌ర్ క‌ట్‌గా క‌నిపించాయి. అల్లు అర్జున్ త‌న మావ‌య్య అయిన ప‌వ‌న్ కళ్యాణ్ కోసం ప్ర‌చారానికి వెళ్ల‌కుండా, జ‌న‌సేప ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం నంద్యాల వెళ్లాడు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల‌కి వెళ్లిన బ‌న్నీ ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక్క‌డే అస‌లు నిప్పు రాజుకుంది. బ‌న్నీ చేసిన ప‌ని చాలా మందికి న‌చ్చ‌లేదు. ఆయ‌న‌పై దారుణంగా ట్రోల్ చేశారు. మెగా అభిమానులు,జ‌న‌సేన నాయ‌కులు మండి ప‌డ్డారు.

ఇక జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు అయితే త‌న ట్విట్ట‌ర్‌లో తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ అల్లు అర్జున్‌ని ఉద్దేశించి చేశాడ‌ని అంద‌రు భావించారు. ఇక ఈ విష‌యం వైర‌ల్ కావ‌డంతో అల్లు అర్జున్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఘాటు పదజాలంతో నాగ‌బాబుపై రెచ్చిపోయారు. వందల సంఖ్యలో రిప్లైలు పడ్డాయి ఈ ట్వీట్‌కు. అల్లు అర్జున్ ఆర్మీ మాత్రమే కాకుండా అటు వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా నాగబాబుపై ఘాటు విమర్శలు చేస్తూ నానా ర‌చ్చ చేశారు. ఈ స‌మ‌యంలో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌ని డీ యాక్టివేట్ చేశారు.

ఇక ఈ రోజు తిరిగి మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌లోకి వ‌చ్చిన నాగబాబు..”నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను”, అంటూ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. అయితే త‌న త‌ప్పు తెలుసుకొని అల్లు అర్జున్ ను ఉద్దేశించి పెట్టిన పోస్టును డిలీట్ చేసిన‌ట్టా అని ఒక చర్చ నడుస్తోంది. అలా పోస్టు పెట్టినందువలన అతను మొత్తం ‘ఎక్స్’ నుండి తప్పుకోవాల్సి వచ్చిందా? అనేది కూడా ఇంకో టాక్ నడుస్తోంది.ఏది ఏమైన నాగ‌బాబు ఆ ట్వీట్ డిలీట్ చేయ‌డంతో ప్ర‌స్తుతం మెగా- అల్లు ఫ్యామిలీల గొడ‌వ‌లపై చ‌ర్చ ఆగింది. రానున్న రోజుల‌లో ఇది ఏర‌కంగా వెళుతుందో, దీనిపై మెగా హీరోలు ఎవ‌రైన స్పందిస్తారా వేచి చూడాలి.

 

Exit mobile version